Friday, May 17, 2024
- Advertisement -

మోడీతో దొంగాట… జగన్‌దో, బాబుదో తేల్చే విషయం ఇదిగో

- Advertisement -

టిడిపి ఎంపిలను హీరోలను చేస్తున్నారు….ఆర్థికంగా అందరికంటే బలవంతుడైన గల్లా జయదేవ్‌ని ఇంకా పెద్ద హీరోని చేస్తున్నారు. ఇక బాబు ఆగ్రహం, బాబు రంకెలు అంటూ మోడీపైన యుద్ధం చేస్తున్న వీరుడు చంద్రబాబని ఆంధ్రప్రదేశ్ ప్రజలను నమ్మించడానికి విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఒక్క ప్రశ్నకు మాత్రం సమాధానం చెప్పలేక అడ్డంగా దొరికిపోతున్నారు. ఆ ఒక్క విషయంలో చంద్రబాబుని సమర్థించలేక చేతులెత్తేస్తున్నారు. మోడీతో జగన్ దొంగాట ఆడుతున్నాడు అని ఆరోపణలు చెయ్యడానికి మాత్రం అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు కానీ అదే మోడీతో చంద్రబాబు ఆడుతున్న దొంగాట గురించి సాక్ష్యాలతో సహా నిలదీస్తే నీళ్ళు నములుతున్నారు.

బడ్జెట్ ప్రవేశ పెట్టిన తర్వాత రోజే బడ్జెట్‌లో జరిగిన అన్యాయం గురించి మీడియా ముఖంగా మాట్లాడాడు జగన్. బడ్జెట్‌లో రాష్ట్రానికి అన్యాయం జరిగిందని చెప్పాడు. కేంద్ర కేబినెట్‌లో ఇద్దరు మంత్రులు ఉన్నప్పటికీ బడ్జెట్‌లో రాష్ట్రానికి కనీస స్థాయిలో కూడా చంద్రబాబు నిధులు తీసుకురాలేకపోయాడని చెప్పుకొచ్చాడు. ప్యాకేజీ అని ఒప్పుకుంటే ఇలా అడుక్కునే పరిస్థితి ఉంటుందనే ప్రత్యేక హోదాను హక్కుగా ఇవ్వాలని కోరానని జగన్ చెప్పాడు. హోదా ఇస్తే ఇప్పుడు కూడా బిజెపితో కలవడానికి రెడీ అన్నాడు. ఆ మాటకొస్తే హోదా ఇస్తే ఏ పార్టీతోనైనా కలుస్తామని చెప్పాడు. ఇక తాజాగా హోదా కోసం ఢిల్లీ జంతర్ మంతర్ వేదికలో వచ్చే నెల 5న ధర్నా చేస్తామని కూడా చెప్పాడు. ఆ తర్వాత ఎంపిలు….ఇంకా అవసరమైతే ఎమ్మెల్యేల చేత కూడా రాజీనామా చేయిస్తానని చెప్పాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాల విషయంలో జగన్ వైఖరి ఇంత స్పష్టంగా ఉంది. రాష్ట్ర బంద్‌లో కూడా స్వయంగా పాల్గొన్నాడు జగన్.

మరి చంద్రబాబు ఏం చేశాడు? బడ్జెట్ రోజు నుంచీ ఈ రోజు వరకూ కూడా ఒక్క సారి కూడా చంద్రబాబు బడ్జెట్ గురించి ఎందుకు మాట్లాడలేదు? బాబు ఆవేశపడ్డాడు, రంకెలేస్తున్నాడు అంటూ పచ్చ మీడియాలో వార్తా కథలు రాయించడం తప్పితే డైరెక్ట్‌గా మీడియా ముందుకు వచ్చి ఎందుకు మాట్లాడడం లేదు? తెదేపా ఎంపిలను తెర ముందు చూపిస్తూ తాను ఎందుకు తెర వెనుక ఉండి రాజకీయం నడిపిస్తున్నాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రయోజనాల కోసం తెరవెనుక ఉండి, దొంగచాటుగా రాజకీయాలు చేయాల్సిన అవసరం చంద్రబాబుకు ఏంటి? ఇప్పటికీ కూడా ఎన్డీఏలో బాగస్వామిగా ఉంటూ, కేబినెట్‌లో ఉన్న ఇద్దరు టిడిపి కేంద్ర మంత్రులు ఆంధ్రప్రదేశ్‌కి చిప్ప చూపించిన ఈ బడ్జెట్‌ని ఆమోదిస్తూ ఉంటే చంద్రబాబు ఎందుకు అడ్డుచెప్పలేదు? బడ్జెట్‌ ప్రవేశ పెట్టిన తర్వాత ప్రజల్లో తీవ్ర ఆగ్రహం రేకెత్తిన తర్వాత కూడా తెరవెనుక ఉండి దొంగచాటు రాజకీయాలు ఎందుకు నడిపిస్తున్నాడు? ‘నేను మాత్రం ఒక్క మాట కూడా అనను…….కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఆగ్రహం చల్లారే వరకూ నా పార్టీ ఎంపిలు, నేతలు మాత్రం కాస్త హంగామా చేస్తారు…..ఏమీ అనుకోవద్దు’ అని మోడీతో ఏమైనా ఒప్పందం చేసుకున్నాడా? ఆ మధ్య హోదా కోసం పోరాటం అన్న పవన్ కూడా ఇదే శైలిలో వ్యవహరించిన విషయం తెలిసిందే. మోడీ, చంద్రబాబులను మాత్రం డైరెక్ట్‌గా ఒక్క మాట కూడా అనలేదు. కానీ అరుణ్ జైట్లీ, గడ్కరీ, అశోక్ గజపతి రాజు, సుజనా చౌదరిలాంటి సెకండ్ గ్రేడ్ నాయకులను మాత్రం తీవ్రస్థాయిలో విమర్శించేవాడు. మోడీకి, చంద్రబాబుల సారథ్యంలో బంట్లులాగా నడిచే నాయకులను తిడితే రాష్ట్రానికి ఏం ప్రయోజనం? కానీ పవన్ తీరు మాత్రం అలానే ఉండేది. మోడీతో చంద్రబాబుతో తెరవెనుక ఒప్పందాలు చేసుకుని ఆయా పార్టీల్లో ఉన్న సెకండ్ గ్రేడ్ నాయకులను తిడుతూ ప్రజల కోసం పోరాటం చేస్తున్నాను అన్న బిల్డప్ ఇచ్చేవాడు. ఇప్పుడు చంద్రబాబు రాజకీయం కూడా అదే. ఆయన మాత్రం మోడీకి వ్యతిరేకంగా, బడ్జెట్‌లో రాష్ట్రానికి జరిగిన అన్యాయానికి వ్యతిరేకంగా ఒక్క మాట కూడా మాట్లాడడు. అలాగని పూర్తిగా మౌనంగా ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల దృష్టిలో జీరోలవుతారు కాబట్టి టిడిపి సెకండ్ గ్రేడ్ నేతల చేత హంగామా చేయిస్తూ ఉంటాడు.

విభజన నాడు కూడా ఇవే దొంగనాటకాలు……అధినేత అయిన బాబేమో రెండు కళ్ళ సిద్ధాంతం అంటాడు. సెకండ్ గ్రేడ్ టిడిపి నాయకులు మాత్రం తెలంగాణాలో ప్రత్యేక తెలంగాణా అని, సీమాంధ్రలో సమైక్యాంధ్ర అని షో చేస్తారు. ఆ డ్రామాలతోనే అప్పుడు సీమాంధ్రను పూర్తిగా ముంచారు. ఇప్పుడు మళ్ళీ అవే దొంగనాటకాలతో నాలుగేళ్ళుగా సీమాంధ్రకు నష్టం చేస్తున్నారు. మోడీకి వ్యతిరేకంగా మాట్లాడడం లేదని చెప్పి ఇంకొకరిని నిలదీసే అర్హత ఈ దొంగ నాటకాల నాయకులకు ఉందా అసలు?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -