Saturday, May 18, 2024
- Advertisement -

చ‌రిత్ర సృష్టించిన భారత క్రికెట్ జ‌ట్టు

- Advertisement -

కంగారూల గ‌డ్డ‌పై భార‌త క్రికెట్ చరిత్ర సృష్టించింది. తొలిసారి ద‌క్షిణాఫ్రికాలో ఓ సిరీస్‌ను చేజిక్కించుకుంది. మంగళవారం జరిగిన ఐదో వన్డేలో కోహ్లీసేన 73 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాను మట్టికరిపించింది. గతంలో ఆరుసార్లు ద‌క్షిణాఫ్రికాలో పర్యటించిన భార‌త జ‌ట్టు ఒక్క వన్డే సిరీస్‌లో కూడా విజేతగా నిలవలేకపోయింది. అయితే ఈసారి అద్భుత‌మైన ఫామ్‌తో భార‌త్‌కు మ‌ర‌పురాని విజ‌యం అందించారు. తొలిసారి వన్డే సిరీస్‌ను గెలుచుకొని సత్తా చాటింది. రెండేళ్ల కింద‌టి సొంతగడ్డపై ఎదురైన వన్డే సిరీస్‌ పరాజయానికి కూడా సరైన రీతిలో ప్రతీకారం తీర్చుకుంది. ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్‌ స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. పేలవ ఫామ్‌ నుంచి బయటపడ్డ రోహిత్‌ శర్మ (115; 126 బంతుల్లో 11×4, 4×6) సెంచరీతో మెరిశాడు. ఆఖరులో తడబాటుతో అనుకున్నన్ని పరుగులు చేయకపోయినా.. ఫీల్డింగ్‌లో పొరపాట్లు చేసినా.. చక్కని బౌలింగ్‌తో ఆతిథ్య జట్టును భారత ఆట‌గాళ్లు అడ్డు చెప్పారు.

రోహిత్‌ మెరవడంతో మొదట భారత్‌ 7 వికెట్లకు 274 పరుగులు సాధించింది. ఛేదనలో హషీమ్‌ ఆమ్లా (71; 92 బంతుల్లో 5×4) పోరాడినా దక్షిణాఫ్రికాకు ఫలితం లేకపోయింది. పాండ్య (2/30), చాహల్‌ (2/43), కుల్‌దీప్‌ (4/57) విజృంభించడంతో ఆ జట్టు 42.2 ఓవర్లలో 201 పరుగులకే ఆలౌటైంది. రోహిత్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు లభించింది. ఈ విజయంతో ఆరు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్‌ 4-1తో తిరుగులేని ఆధిక్యం సంపాదించింది. ఐదు వన్డేల్లో 30 వికెట్లు తీసిన మణికట్టు స్పిన్‌ ద్వయం కుల్‌దీప్‌, చాహల్‌ సిరీస్‌ విజయంలో కీలక పాత్ర పోషించారు.ఏ ఫార్మాట్లోనైనా దక్షిణాఫ్రికా గడ్డపై సిరీస్‌ గెలవడం టీమ్‌ ఇండియాకు ఇదే తొలిసారి. చివరిదైన ఆరో వన్డే శుక్రవారం సెంచూరియన్‌లో జరుగుతుంది.

స్కోర్ వివ‌రాలు
భారత్‌: ధావన్‌ (సి) ఫెలుక్వాయో (బి) రబాడ 34; రోహిత్‌ శర్మ (సి) క్లాసన్‌ (బి) ఎంగిడి 115; కోహ్లి రనౌట్‌ 36; రహానె రనౌట్‌ 8; శ్రేయస్‌ అయ్యర్‌ (సి) క్లాసన్‌ (బి) ఎంగిడి 30; పాండ్య (సి) క్లాసన్‌ (బి) ఎంగిడి 0; ధోని (సి) మార్‌క్రమ్‌ (బి) ఎంగిడి 13; భువనేశ్వర్‌ నాటౌట్‌ 19; కుల్‌దీప్‌ యాదవ్‌ నాటౌట్‌ 2; ఎక్స్‌ట్రాలు 17 మొత్తం: (50 ఓవర్లలో 7 వికెట్లకు) 274; వికెట్ల పతనం: 1-48, 2-153, 3-176, 4-236, 5-236, 6-238, 7-265; బౌలింగ్‌: మోర్నీ మోర్కెల్‌ 10-2-44-0; రబాడ 9-0-58-1; ఎంగిడి 9-1-51-4; ఫెలుక్వాయో 8-0-34-0; డుమిని 4-0-29-0; శంసి 10-0-48-0

దక్షిణాఫ్రికా : ఆమ్లా రనౌట్‌ 71; మార్‌క్రమ్‌ (సి) కోహ్లి (బి) బుమ్రా 32; డుమిని (సి) రోహిత్‌ (బి) పాండ్య 1; డివిలియర్స్‌ (సి) ధోని (బి) పాండ్య 6; మిల్లర్‌ (బి) చాహల్‌ 36; క్లాసన్‌ (స్టంప్డ్‌) ధోని (బి) కుల్‌దీప్‌ 39; ఫెలుక్వాయో (బి) కుల్‌దీప్‌ 0; రబాడ (సి) చాహల్‌ (బి) కుల్‌దీప్‌ 3; మోర్కెల్‌ ఎల్బీ (బి) చాహల్‌ 1; శంసి (సి) పాండ్య (బి) కుల్‌దీప్‌ 0; ఎంగిడి నాటౌట్‌ 4; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం: (42.2 ఓవర్లలో ఆలౌట్‌) 201; వికెట్ల పతనం: 1-52, 2-55, 3-65, 4-127, 5-166, 6-168, 7-196, 8-197, 9-201; బౌలింగ్‌: భువనేశ్వర్‌ 7-0-43-0; బుమ్రా 7-0-22-1; పాండ్య 9-0-30-2; కుల్‌దీప్‌ యాదవ్‌ 10-0-57-4; చాహల్‌ 9.2-0-43-2

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -