Saturday, April 27, 2024
- Advertisement -

ఆ థియేటర్లో జీవితాంతం ఉచితంగా చూడొచ్చు.. ఎక్కడో తెలుసా?

- Advertisement -

ఈ ఏడాది ఎవరి టైమ్ చూసినా బ్యాడ్ బ్యాడ్ అంటున్న విషయం తెలిసిందే. చైనాలోని పుహాన్ లో పుట్టుకు వచ్చిన కరోనా వైరస్ ప్రపంచాన్ని మొత్తం ఛిన్నాభిన్నం చేసింది. ముఖ్యంగా కరోనా ఎఫెక్ట్ ఎంటర్ టైన్మెంట్ పై పడింది. కరోనా వచ్చిన మొదలు థియేటర్లు, మాల్స్ అన్నీ మూసివేశారు. షూటింగ్స్ కూడా అన్నీ క్యాన్సల్ చేసుకున్నారు. ఇప్పడిప్పుడే షూటింగ్స్ మొదలయ్యాయి. థియేటర్స్, మాల్స్ ఓపెన్ చేస్తున్నారు.

తాజాగా కొత్త సంవత్సరం నుంచి ఇక సినిమా హాల్లో జీవితాంతం ఉచితంగా సినిమా చూడొచ్చు.. ఇది మంచి శుభవార్త. కాకపోతే వలం త్రివిధ దళాలకు చెందిన సైనికులకు మాత్రమే. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్‌లో పనిచేసే సైనికులు ఎవరైనా సరే థియేటర్‌కు వెళ్లి తమ ఐడీకార్డును చూపించి సినిమా చూడొచ్చు. ఇంతకీ ఈ ఆఫర్‌ ఇచ్చింది బీహార్‌ రాష్ట్రంలోని పాట్నాలోని రెజెండ్ థియేటర్‌ యజమాని. 

ఈ సందర్భంగా థియేటర్ యజమాని సుమన్‌ కే సిన్హా మాట్లాడుతూ.. దేశ సేవలో ఉండే సైనికులకు వినోదం అందించడం నా బాధ్యతగా భావించానని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఈ కొత్త ఆఫర్‌ వచ్చే ఏడాది జనవరి నుంచి అమలులోకి వస్తుందని, పాట్నాలోని దనాపూర్‌ రెజిమెంట్‌లో సుమారు 1200 మంది ఆర్మీ సిబ్బంది ఉన్నారు. కాగా, దేశంలో ఇలాంటి ప్రకటన రావడం ఇదే తొలిసారి. సైనికుల కోసం ఆయన తీసుకున్న నిర్ణయాన్ని పలువురు సైనికులు స్వాగతిస్తున్నారు. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -