Sunday, May 5, 2024
- Advertisement -

అబ్బాయిల‌కు ఎప్పుడు దాని మీదే ధ్యాస‌..!

- Advertisement -

సందీప్ కిష‌న్‌, త‌మ‌న్నా హీరో ,హీరోయిన్లుగా న‌టించిన చిత్రం నెక్ట్స్ ఏంటీ.ఇటీవ‌లే విడుద‌ల చేసిన ఫ‌స్ట్ లుక్‌కి మంచి స్పంద‌న వ‌చ్చింది.తాజాగా ఈ సినిమా టీజ‌ర్‌ను విడుద‌ల చేశారు చిత్ర యూనిట్‌.”అసలు మీ అబ్బాయిలు ఏం ఆలోచిస్తూ ఉంటారు.. దాని గురించేనా లైక్ 24X7?” ఈ ఒక్క డైలాగ్ తో తమన్నా షాక్ ఇచ్చింది. దానికి నవదీప్ కూడా “100%” అని అని క్లారిటీ ఇచ్చాడు. ‘లైఫ్ చాలా చిన్నదని.. అమ్మాయిల విషయంలో అవకాశాన్ని మిస్ చేసుకోకూడదని”దట్ వన్ ఛాన్స్.. గ్రాబ్ ఇట్” అంటూ స్నేహితులకు ఒక ఫిలాసఫీ టచ్ ఇవ్వడం చూస్తుంటే అతను ఒక ప్లే బాయ్ లా కనిపిస్తున్నాడు.

టీజ‌ర్‌లో త‌మ‌న్నా ,సందీప్ కిష‌న్‌లు లిప్ టూ టిప్ కిస్‌తో రెచ్చిపోయారు. టీజ‌ర్‌ను ఈ జనరేషన్‌కి త‌గిన‌ట్లుగా క‌ట్ చేయ‌డంతో ద‌ర్శ‌కుడు మంచి విజ‌యం సాధించాడు. స్క్రీన్ ప్లే తో దర్శకుడు కునాల్ కోహ్లీ మ్యాజిక్ ఏమైనా చేసి ఉంటే సినిమాకు ప్లస్ పాయింట్ అయ్యే అవకాశం ఉంది.ఎప్పుడో రిలీజ్ కావాల్సిన ఈ సినిమా గత కొంత కాలంగా వాయిదా పడుతూ వస్తోంది. ఇక ఈ సినిమాను వ‌చ్చే నెల‌లో విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -