Monday, April 29, 2024
- Advertisement -

విజయసాయి మాస్టర్ స్కెచ్….. ఆపరేషన్ గరుడ శివాజీకి ముప్పు తప్పదా?

- Advertisement -

ఆపరేషన్ గరుడ పురాణంతో ఎంచక్కా 2019ఎన్నికల గోదారి ఈదుదాం అని తలచిన వాళ్ళకు చుక్కలు కనిపించే రోజులు త్వరలోనే రానున్నాయా? చంద్రబాబు స్కెచ్‌కి కౌంటర్ స్కెచ్ వేయడంలో వైకాపా సక్సెస్ అయిందా? అవుననే అంటున్నాయి ఢిల్లీ వర్గాలు. వందల సంఖ్యలో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఏ ఒక్క హామీని కూడా ఇచ్చినమేరకు అమలు చేయలేదు అన్నది కంటికి కనిపిస్తున్న వాస్తవం. ఇక మోడీది నాది అభివృద్ధి జోడీ, మోడీని గెలిపించండి……హోదాతో సహా అన్నీ వస్తాయి అని ఆంధ్రప్రదేశ్ ప్రజలు విభజన పాపంలో సమాన భాగం ఉన్న బిజెపికి ఓట్లేసేలా చేసినవాళ్ళు ఎవరో సీమాంధ్రులు ఇంకా మర్చిపోలేదు.

అయినప్పటికీ మొత్తం పాపం మోడీపై నెట్టేసేలా……ఆ పాపంలో జగన్ కూడా భాగస్వామి అని జనాలు నమ్మేలా ఆపరేషన్ గరుడ పురాణాలు రచించారు. శివాజీతో సహా పచ్చ మీడియా అంతా విశేషంగా ప్రచారం కల్పించింది. అయితే ప్రతిపక్ష నేతపై హత్యాయత్నానికి కూడా ఒడిగట్టే స్థాయి పథకంతో ఇప్పుడు అందరూ అడ్డంగా బుక్కయ్యారన్న వార్తలు వినిపిస్తున్నాయి. జగనే కనుక తనపైన దాడి చేయించుకుని ఉంటే ఈపాటికి ఎప్పుడు అధికారంలో ఉన్న చంద్రబాబు, వ్యవస్థలను అన్నింటినీ ఉపయోగించి సాక్ష్యాలతో సహా నిరూపించి జగన్‌కి రాజకీయభవిష్యత్తు లేకుండా చేసి ఉండేవాడు. అలా చేయకుండా విచారణ సమర్థవంతంగా జరగకుండా అడ్డుకుంటున్నారంటే అసలు విషయం ఏంటో ఇట్టే అర్థమవుతోంది. అయితే రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్‌తో తనకు ఉన్న సన్నిహిత సంబంధాలను ఉపయోగించకుంటే జగన్‌పై హత్యాయత్నం కేసులో అసలు దోషులకు శిక్షపడేలా వైకాపా నేత విజయసాయిరెడ్డి వ్యూహం రచించారని తెలుస్తోంది.

ఢిల్లీలో ఉన్న తెలుగు జర్నలిస్టుల మధ్య ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ అవుతోంది. ఈ సారి పచ్చ బ్యాచ్ జనాలు ఎవ్వరూ తప్పించుకోకుండా ఉండేలా………కనీసం ప్రజా కోర్టులో అయినా దోషులుగా నిలబెట్టేలా జగన్ సారథ్యంలో విజయసాయిరెడ్డి బృందం వ్యూహరచనను అమలు చేస్తోందని తెలుస్తోంది. తాజాగా ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తికి కూడా నోటీసులు అందడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఎన్నో సార్లు కోర్టులను మేనేజ్ చేసిన జనాలు మరోసారి మేనేజ్ చేయడం, స్టే రాజకీయాలు చేయడంలో సక్సెస్ అవుతారా? బుక్కవుతారా? చూడాలి మరి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -