Monday, May 6, 2024
- Advertisement -

ఎన్ జీ కే’ ఫ్లాప్ పై రియాక్ట్ అయిన సూర్య

- Advertisement -

టాలీవుడ్ లో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న కోలీవుడ్ స్టార్ హీరో సూర్య గత కొంతకాలంగా వరుస ఫ్లాపులతో సతమతమవుతున్నాడు. ఆఖరికి భారీ అంచనాల మధ్యన విడుదల అయినప్పటికీ సూర్య హీరోగా సెల్వరాఘవన్ దర్శకత్వంలో నటించిన ‘ఎన్ జీ కే’ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా మారింది. అటు తమిళ్ మరియు ఇటు తెలుగు భాషల్లో ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్గా నిలిచింది. తాజాగా ఈ సినిమా గురించి సూర్య ఒక ఆసక్తికరమైన ట్వీట్ చేశాడు.

”ఎన్ జీ కే’ సినిమా పై మీ అభిప్రాయాలను, ప్రేమను నేను చాలా వినయంగా స్వీకరిస్తాను.మా ఈ సరికొత్త ప్రయత్నాన్ని మరియు నటీనటుల పర్ఫార్మెన్స్ ని అర్థం చేసుకొని అభినందించిన వారికి నా కృతజ్ఞతలు. ఈ సినిమాను తీసినందుకు కాస్ట్ అండ్ క్రూ కి నా ధన్యవాదాలు.” అని సోషల్ మీడియాలో ద్వారా తెలియజేశాడు సూర్య. మరోవైపు సూర్య త్వరలో ‘కాప్పాన్’ సినిమా తో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు. సూర్య లాగానే అతని అభిమానులు కూడా ఈ సినిమాపైనే ఆశలు పెట్టుకున్నారు. మరి కనీసం ఈ సినిమాతో అయినా సూర్య ఫామ్ లోకి వస్తాడో లేదో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -