Sunday, May 19, 2024
- Advertisement -

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి రూ.500 జ‌రిమానా విధింపు..

- Advertisement -

పనిమనిషి నిర్వాకం కారణంగా టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లికి మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ గురుగ్రామ్‌(ఎమ్‌సీజీ) జరిమానా విధించింది.వివరాల్లోకి వెళ్తే…విరాట్ కోహ్లీ నివాసం ఉంటున్న గురుగ్రామ్ లో నీటి కొరత తీవ్రంగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో కోహ్లీ ఇంట్లో ఉన్న ఒక వ్యక్తి మంచి నీటితో కార్లు కడుగుతుండటాన్ని చూసిన ఒక వ్యక్తి… దాన్ని వీడియో తీసి, మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేశాడు.

దీంతో రంగంలోకి దిగిన ఎమ్‌సీజీ అధికారులు కోహ్లికి జరిమానా విధించారు. నిబంధనల మేరకు కోహ్లీకి రూ. 500 జరిమానా విధిస్తూ నోటీసులు పంపారు. ప్రస్తుతం దేశంలోని పలు ప్రాంతాల్లో నీటి ఎద్ద‌డి ఉన్న సంగ‌తి తెలిసిందే. వ‌ర్షాలు ప‌డేంత వ‌ర‌కు నీటిని వృథాకాకుండా వాడుకోవాల‌ని అధికారులు సూచించినా ఫ‌లితం క‌నిపించ‌డంలేదు. కొంతమంది సంపన్నుల ఇళ్లల్లో మాత్రం వేలాది గ్యాలన్ల కొద్దీ నీళ్లు వృథా అవుతున్నాయి. గురుగ్రామ్‌లో కూడా ఇటువంటి పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో తాగునీటిని పొదుపు వాడుకోవాల్సిందిగా ఎమ్‌సీజీ విఙ్ఞప్తి చేసింది. కొంతమంది సంపన్నుల ఇళ్లల్లో మాత్రం వేలాది గ్యాలన్ల కొద్దీ నీళ్లు వృథా అవుతున్నాయి. అయినప్పటికీ వారిలో మార్పు రాకపోవడంతో కోహ్లితో పాటు మరికొంత మందికి కూడా జరిమానా విధించింది. ఇక ప్రపంచకప్‌-2019 నిమిత్తం విరాట్‌ కోహ్లి ప్రస్తుతం ఇంగ్లండ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సౌతాఫ్రికాతో జరిగిన తొలి మ్యాచ్‌లో ఆరు వికెట్ల తేడాతో గెలుపొందిన సంగ‌తి తెలిసిందే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -