- Advertisement -

మెగా హీరోలు ఎలాంటివారో చెప్పిన‌ నిహారిక‌!

- Advertisement -

మెగా డాట‌ర్‌గా త‌నకంటు ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకుంది నిహారిక‌.ఒక వైపున వెబ్ సిరీస్,మరో వైపున తెలుగు , తమిళ సినిమాలపై నిహారిక ఫోక‌స్ పెడుతోంది.ఒక మ‌న‌స్సుతో ఇండ‌స్ట్రీకి ప‌రిచియం అయింది నిహారిక‌. ఈ సినిమా అనుకున్నంత విజ‌యం సాధించ‌లేదు,కాని సినిమాలో నిహారిక న‌ట‌న‌కు మంచి పేరు వ‌చ్చింది. సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది నిహారిక‌.తాజాగా ఓ మీడియాకు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో త‌మ ఫ్యామీలి హీరోల‌పై చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి.

మెగా హీరోల్లో ఎవరెవరి నుంచి ఏం నేర్చుకున్నారు? అనే ప్రశ్నకి సమాధానంగా ఆమె ఇలా స్పందించింది. హార్డ్ వర్క్ చిరంజీవిగారి నుంచి నేర్చుకున్నాను , ఎలాంటి సమస్యనైనా తీరుతుంద‌ని అన్నింటికి భాద‌ప‌డ‌కుడ‌ద‌ని నాన్న నుంచి నేర్చుకున్నాని,అలాగే మ‌నం కూడా సామాన్య మ‌నుషుల‌మే అని కల్యాణ్ బాబాయ్ నుండి నేర్చుకున్నాని తెలిపింది. మెగా కుర్ర హీరోల నుండి ఎంతో కొంత నేర్చుకుంటున్నాని తెలిపింది నిహారిక‌.ఫ్యామిలీకి మొదటి ప్రాధాన్యతను ఇవ్వడమనేది చరణ్ నుంచి, కోపం ఎప్పుడు చూపించాలనే విషయాన్ని వరుణ్ తేజ్ నుంచి నేర్చుకున్నాను.

అంకితభావం అనేది అల్లు అర్జున్ ను చూసి తెలుసుకున్నాను. సోషల్ మీడియాలో ఎలా వ్య‌వ‌హరించాలో శిరీష్‌ను చూసి నేర్చుకున్నాని ,మ‌నకంటే చిన్న స్థాయి వాళ్ల‌ను కూడా ఎలా గౌర‌వించాలో సాయి ధ‌ర‌మ్‌ని చూసి నేర్చుకున్నాని అలాగే మా ఇంట్లో ప్ర‌తి వ్య‌క్తి స‌మాన‌మైన స్థానం ఉంటుంద‌ని,పురుష‌,స్త్రీ అనే భేదాలు ఉండ‌వ‌ని తెలిపింది.అందుకే త‌ను సినిమాల‌లోకి వెళ్తాను అంటే ఎవ‌రు వ్య‌తిరేకించ‌లేద‌ని తెలిపింది.

https://www.youtube.com/watch?v=bnQNA8GntRY

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -