Wednesday, April 24, 2024
- Advertisement -

లాక్ డౌన్ లో బోర్ కొడుతుందంటున్న నిహారిక?

- Advertisement -

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనా కేసులు అధికమవుతున్న నేపథ్యంలో పలు రాష్ట్రాలలో లాక్ డౌన్ అమలు చేశారు. మరికొన్ని రాష్ట్రాలలో కర్ఫ్యూలు విధిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రతి ఒక్కరు ఇంట్లోనే ఉంటూ కరోనా వైరస్ ను కట్టడి చేయడం కోసం ప్రయత్నిస్తున్నారు. లాక్ డౌన్ కారణంగా సినిమా షూటింగులకు బ్రేక్ పడటంతో సినీ సెలబ్రిటీల మొత్తం ఇంట్లోనే ఉంటూ కాలం వెళ్లదీస్తున్నారు.

నిత్యం ఎంతో మంది టెక్నీషియన్ల మధ్య షూటింగ్ నిర్వహించుకునే సెలబ్రిటీలు ప్రస్తుతం నాలుగు గోడల మధ్య ఉండాలంటే ఎంతో బోర్ గా అనిపిస్తుంది. అయితే కొందరు సెలబ్రిటీలు లాక్ డౌన్ సమయంలో వారి శరీర ఫిట్ నెస్ పై దృష్టి సారించగా మరికొందరు వివిధ రకాల వంటలను తయారు చేస్తూ సందడి చేస్తున్నారు.

Also read:అను ఇమాన్యుల్ కు నెటిజెన్ వింత ప్రపోజల్..?

ఈ క్రమంలోనే మెగా డాటర్ నిహారిక సైతం లాక్ డౌన్ చాలా బోరింగ్ గా ఉందంటూ తెలియజేస్తున్నారు. ఈ మేరకు నిహారిక షేర్ చేసిన ఫోటో వైరల్ గా మారింది.మామూలుగానే మహిళలు ఏ మాత్రం ఖాళీ సమయం దొరికినా వారు వారి అందానికి మెరుగులు దిద్దడం కోసం ఉపయోగిస్తుంటారు. నిహారిక కూడా లాక్ డౌన్ సమయంలో అందంగా ముస్తాబై సెల్ఫీలతో కాలక్షేపం చేస్తున్నారు. అదేవిధంగా తన పెట్ బజ్ బాబుతో కలిసి ఏం తోచకపోవడంతో గోడలను చూసుకుంటూ ఉన్నారు. మొత్తానికి నిహారిక ఈ లాక్ డౌన్ ను కష్టంగానే వెళ్లదీస్తున్నారు.లాక్ డౌన్ లో బోర్ కొడుతుందంటున్న నిహారిక?

Also read:ఆర్ఆర్ఆర్ ఎన్టీఆర్ పోస్టర్ పై ఊహించని ఫీడ్ బ్యాక్.. ఏంటంటే?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -