Tuesday, May 21, 2024
- Advertisement -

స్క్రిప్ట్ లు మార్చుకున్న హీరోలు.. ఎవరంటే?

- Advertisement -

సినిమా ఇండస్ట్రీలో కొందరు దర్శకులు హీరో ఇమేజ్ కు అనుగుణంగా సినిమా కథలను సిద్ధం చేసుకుంటారు. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల తమ హీరోలకు డేట్స్ అందుబాటులో లేకపోవడం, కథ నచ్చకపోవడం వంటి కారణాలతో ఒక హీరో కోసం సెట్ చేసిన కథను మరో హీరోతో చేయాల్సి వస్తుంది. ఇలాంటి సందర్భాలు తెలుగు ఇండస్ట్రీలో చాలా ఉన్నాయి. అలాగే ఒక హీరో కోసం సిద్ధం చేసిన కథలను మరో హీరోతో సినిమా చేసి బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్న సందర్భాలు ఉన్నాయి.

తాజాగా అలాంటి సందర్భాలే తెలుగు ఇండస్ట్రీలో చోటుచేసుకున్నాయి. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించాల్సిన సినిమా యంగ్ హీరో రామ్ చేతికి, అలాగే రామ్ నటించాల్సిన సినిమా మెగా హీరో వరుణ్ తేజ్ చేతికి వెళ్లిందని ప్రచారం జరుగుతోంది. వివరాల్లోకి వెళితే ప్రస్తుతం హీరో రామ్ లింగుస్వామి దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాను మొదట అల్లు అర్జున్ తో చేయాలనుకున్నాడట దర్శకుడు లింగుస్వామి. గతంలో అల్లు అర్జున్ లింగుస్వామి కాంబినేషన్లో ఒక సినిమా ప్రకటన కూడా వచ్చి ఆగిపోయిన సంగతి తెలిసిందే.

Also read:ఆర్ఆర్ఆర్ ఎన్టీఆర్ పోస్టర్ పై ఊహించని ఫీడ్ బ్యాక్.. ఏంటంటే?

గరుడ వేగ ప్రేమ్ దర్శకుడు ప్రవీణ్ సత్తారు వరుణ్ తేజ్ తో సినిమా చేయడానికి సిద్ధమైనట్టు తెలుస్తోంది. అయితే ప్రవీణ్ సత్తారు మొదట ఈ కథను హీరో రామ్ కోసం సిద్దం చేశాడట. కొన్ని అనివార్య కారణాలతో హీరో రామ్ ఈ కథ పై ఆసక్తి చూపకపోవడంతో తాజాగా ఆ కథను వరుణ్ తేజ్ కి వినిపించగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఈ కాంబినేషన్ మార్పుతో వస్తున్న సినిమాలపై సినీ ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.

Also read:ఆచార్య గురించి మరో క్రేజి బజ్.. సినిమాలో ఆ సాంగే హైలెట్?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -