Thursday, April 25, 2024
- Advertisement -

ఆర్ఆర్ఆర్ ఎన్టీఆర్ పోస్టర్ పై ఊహించని ఫీడ్ బ్యాక్.. ఏంటంటే?

- Advertisement -

టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న మల్టీస్టారర్ సినిమా “ఆర్ఆర్ఆర్”. ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా నటిస్తుండగా ఆలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. బాహుబలి మూవీతో పాన్ ఇండియా దర్శకునిగా క్రేజ్ తెచ్చుకున్న రాజమౌళి తాజాగా రూపొందిస్తున్న “ఆర్ఆర్ఆర్” మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి.ఈ సినిమాలో స్వాతంత్ర్య సమరయోధుడు అల్లూరి సీతారామ రాజుగా రామ్ చరణ్, గిరిజన వీరుడు కొమురం భీమ్‌గా జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్నాడు.

తాజాగా మే 20 న యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టినరోజు కావడంతో ఆయన పుట్టినరోజు కానుకగా “ఆర్ఆర్ఆర్”సినిమా నుంచి కొమురం భీమ్ లుక్‌లో భీకరంగా బల్లాన్ని ఎక్కుపెట్టిన ఎన్టీఆర్ పోస్టర్‌ని రిలీజ్ చేశాడు దర్శకుడు రాజమౌళి. అయితే ఈ పోస్టర్‌పై అభిమానుల్లో తీవ్ర నిరాశ ఎదురైంది. కొందరు పోస్టర్‌ అదిరిపోయిందటూ అంటుడగా, మరికొందర
నిరుత్సాహంగా ఉన్నారు.ఈ పోస్టర్ కంటే ఫ్యాన్ మేడ్ పోస్టర్లే బాగున్నాయంటూ కామెంట్ చేస్తున్నారు. గతంలో రిలీజ్ చేసిన ‘రామరాజు ఫర్ భీమ్’ అనే టీజర్‌పై కూడా ఇలాంటి మిశ్రమ స్పందనలే వచ్చాయి.

Also read:తుఫానులో సందడి చేసిన నటి… తిట్టిపోస్తున్న జనం!

ఇక జూనియర్ ఎన్టీఆర్ 30వ సినిమాను కొరటాల శివ దర్శకత్వంలో చేయనున్నారు. తర్వాత 31వ సినిమాను ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చేయనున్నట్టు తెలుస్తోంది.
మరోవైపు కరోనా కేసులు తగ్గి సాధారణ పరిస్థితులు వచ్చిన తర్వాతే ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ మొదలు పెట్టాలనే ఆలోచనలో రాజమౌళి ఉన్నట్లు తెలుస్తుంది.

Also read:లాక్‌డౌన్‌ లో బిగ్ బాస్ షూటింగ్… సీల్ చేసిన పోలీసులు!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -