Thursday, May 16, 2024
- Advertisement -

నిహారిక కోసం మెగా హీరోలు ఎవ్వరూ రాలేదు .. అసలు కారణం ఇదే !

- Advertisement -

బుల్లితెర మీద మెగా డాటర్ గా మంచి పేరు తెచ్చుకున్న నిహారిక ఇప్పుడు వెండితెర మీద మెగా హీరోయిన్ అవ్వడం కోసం ఉవ్విళ్ళు ఊరుతోంది. హీరోయిన్ అంటే గ్లామర్ పరంగా కాదు అని డిఫరెంట్ ఫార్ములా సినిమాలతో ఎక్స్ పోజింగ్ కి దూరంగా ఆసక్తికర పాత్రలు చేస్తాను అని చెప్పుకోస్తోంది నిహారిక.

ఈమె కొత్త సినిమా ఒక మనస్సు షూటింగ్ క్లాప్ కొట్టేసారు కానీ ఆమెకి మెగా ఆశీర్వాదాలు ఇంకా అందలేదు. యూనిట్ సభ్యులు ఈ విషయంలో చెబుతున్నదాని బట్టి చూస్తే మెగా హీరోలు ముహూర్తం కి రాకపోవడం వెనక నాగబాబు ఉన్నారు. మెగా హీరోలు అంతా ముహూర్త కి వచ్చేస్తే ఆడియో కి ఎవరు వస్తారు? అందుకే నాగబాబు సైలెంట్ గా కొబ్బరికాయ కొట్టించేసారు రేపు ఆడియో సమయంలో ఫుల్ సపోర్ట్ తీసుకుందాం అని నాగబాబు ప్లాన్.

నిజానికి మెగా హీరోలు ఎంత బిజీ గా ఉన్నా మెగా స్టార్ ఇంకా సినిమా స్టార్ట్ చెయ్యలేదు కాబట్టి వచ్చే వారే కానీ నాగబాబు ఒకేసారి అందరినీ ఆడియో వేడుకలో పిలుద్దాం అని ఆగారట. అదే విషయం మధుర శ్రీధర్ కూడా చెబుతున్నారు.

మెగా బ్లెస్సింగ్స్ లేవు అనే వార్తలు నమ్మద్దు అని ఆయన వాదన. నాగ శౌర్య హీరోగా రూపొందుతున్న ఈ సినిమాను అవార్డు విన్నింగ్ డైరక్టర్ రామ రాజు రూపొందిస్తున్నారు. టివి 9 ఛానల్ వారు కూడా ఈ సినిమా నిర్మాణంలో ఒక పార్టనర్. డిసెంబర్ 1 నుండి రెగ్యులర్ షూటింగ్ చేస్తారని తెలుస్తోంది. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -