Friday, May 17, 2024
- Advertisement -

మళ్లీ సైలెంటయ్యాడు

- Advertisement -

ప్రశ్నించాడో లేదో తెలియదు. కానీ.. ప్రజా సమస్యలపై మాత్రం మాట్లాడానని చెప్పాడు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమావేశం తర్వాత.. ప్రతి విషయంపై ఇద్దరి మధ్య చర్చలు సానుకూల వాతావరణంలో జరిగాయని.. తన విన్నపాలకు బాబు సానుకూలంగా స్పందించారని చెప్పుకొచ్చారు.

తెల్ల పంచె కట్టుకొని వచ్చి.. అసలైన రాజకీయ నాయకుడిగా మాట్లాడారు. ఇంతలోనే మళ్లీ సైలెంట్ అయ్యారు.అసలు ఓ రాజకీయ నాయకుడికి ఎలాంటి లక్షణం ఉండాలి? జనం మేలు కోసం రాజకీయ నాయకుడు ఏం చేయాలి? ఎలాంటి అడుగులు వేస్తే పొలిటికల్ లీడర్ గా సక్సెస్ అవుతాడు? అన్న ఆలోచన లేకుండా పవన ఇలా వ్యవహరిస్తే ఎలా ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు.

జనం కోసం ముఖ్యమంత్రిని కలిసిన పవన్.. ఏదో బాక్సైట్ తవ్వకాలనీ, ఇరిగేషన్ ప్రాజెక్టులనీ, రాజధాని సమస్యలనీ.. సామాన్య జనానికి పట్టింపు లేని విషయాలపై స్టేట్ మెంట్లు ఇచ్చి వదిలేశాడు.కానీ.. తను చెప్పిన సమస్యలపై మళ్లీ ఓ సారి జనంలోకి వెళ్తే.. తనపై ప్రజలకు నమ్మకం కలుగుతుందన్న ఆలోచన పవన్ కు ఎందుకు రావడం లేదన్న వాదన వినిపిస్తోంది. చంద్రబాబు రాజకీయాలకు… వైఎస్ రాజశేఖరరెడ్డి తీరుకు అలవాటు పడిన ఏపీ జనాల్లో.. కొందరు కొత్త దనం కోరుకోవడం సహజం.

అలాంటి వారిని తన వైపు తిప్పుకొంటేనే కదా… భవిష్యత్తులో జనసేనకు ఓ కేడర్ కానీ.. పార్టీకి బలం కానీ దక్కేదని పవన్ అభిమానులే కాదు.. ఏ రాజకీయ వర్గానికీ చెందని కొందరు సామాన్యులు కూడా తమ వాదనకు కారణాలు చెబుతున్నారు.ఇవన్నీ జనసేన అధినేతకు అవసరమో లేదో ఎవరికీ తెలియదు.

కానీ.. తనకు నచ్చినపుడు రాజకీయల గురించి మాట్లాడతాడు. మాట వరసుకు ముఖ్యమంత్రితో సమావేశమవుతాడు.. అప్పుడప్పుడు జనం మధ్యలోకి వెళ్లి అర్థం కాని ప్రశ్నలు వేస్తుంటాడు. ఇదే తీరు.. ఇక ముందు కూడా కంటిన్యూ చేస్తే.. అన్న లాగే తమ్ముడు కూడా రాజకీయాల్లో నవ్వులపాలు కాక తప్పదన్న విమర్శలు జోరందుకుంటున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -