Tuesday, May 7, 2024
- Advertisement -

నిర్మాతగా మారబోతున్న ప్రముఖ హీరోయిన్

- Advertisement -

మెగా ప్రిన్స్ నిహారిక కొణిదెల ‘ఒక మనసు’ సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయింది. అయితే మొదటి సినిమాతో డిజాస్టర్ అందుకున్న నిహారిక ‘హ్యాపీ వెడ్డింగ్’ అనే సినిమా నటించింది కానీ ఆ సినిమా కూడా అనుకున్న విజయాన్ని సాధించలేకపోయింది. ‘నాన్న కూచి’, ‘ముద్దపప్పు ఆవకాయ’ వంటి వెబ్ సిరీస్ తో మంచి పేరు తెచ్చుకున్నప్పటికీ నిహారిక వెండితెరపై ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. ఈ మధ్యనే విడుదలైన ‘సూర్యకాంతం’ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా మారడంతో కెరీర్ కి సంబంధించి నిహారిక ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

నిజానికి ఎవరైనా హీరోయిన్లు ఆఫర్లు తగ్గిపోతున్నాయి అనుకున్న సమయంలో గ్లామరస్ పాత్రలు చేయడానికి సిద్ధం అవుతారు. కానీ ఫ్యామిలీ బాక్గ్రౌండ్ వల్ల నిహారిక కి అది కుదరని పని. దీంతో నిహారిక ఇప్పుడు నిర్మాతగా మారాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. తన పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ పతాకంపై సినిమా నిర్మించాలని నిహారిక అనుకుంటుందట. అన్నీ కుదిరితే ఈ సినిమా లో ఎవరో ఒక మెగా హీరో నటించనున్నారు. మరి హీరోయిన్ గా హిట్ అందుకోలేకపోయిన నిహారిక నిర్మాతగా ఎంతవరకు విజయం సాధిస్తుందో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -