Wednesday, May 15, 2024
- Advertisement -

అవున‌వును మామ

- Advertisement -
  • త‌మిళ్ సినిమాలో నిహారిక డైలాగ్‌

త‌మిళ సినిమాలో తెలుగు డైలాగ్ అదిరిపోయింది. మెగా ఫ్యామిలీ వార‌సురాలు నిహారిక అవును అవును మామ అంటూ తెగ న‌టించేసింది. తెలుగులో అచ్చి రాక త‌మిళ‌నాడు పోయిన ఈ అమ్మ‌డు ‘ఒరు నల్ల నాల్ పాతు సోల్రేన్’ అనే సినిమాలో న‌టిస్తోంది. ఇటీవ‌ల ఈ సినిమా టీజ‌ర్ విడుద‌ల అయ్యింది. ప్రముఖ నటుడు విజయ్ సేతుపతి సినిమాలో నటిస్తోంది. విజ‌య్ సేతుప‌తి హీరోగా, విల‌న్‌గా న‌టిస్తున్నాడు. అయితే సినిమాలో గౌత‌మ్ కార్తీక్‌కు జంట‌గా న‌టిస్తోంది.

ఒక మనసు చిత్రంతో హీరోయిన్‌గా బాగానే న‌టించినా సినిమా ఆడ‌క‌పోవ‌డంతో తెలుగులో అవ‌కాశాలు రాలేదు. దీంతో తమిళంలోకి వెళ్ల‌గానే మంచి చిత్రంలో అవ‌కాశం ల‌భించింది. విజ‌య్ సేతుప‌తి చిత్రంలో న‌టిస్తుండ‌డంతో చాలా ఎక్జాయిట్‌మెంట్‌తో న‌ట‌న‌లో ప్ర‌తిభ క‌న‌బ‌రుస్తోంది. గ్లామ‌ర‌స్ పాత్ర‌లోనూ.. రాణిగాను వేషం ఉంది.

కొన్ని సన్నివేశాల్లో నటులంతా వైరైటీ దుస్తుల్లో కనిపిస్తున్నారు. ఏదో రామాయ‌ణంలో రావ‌ణాసురుడి నేప‌థ్యంలో ఈ సినిమా ఉన్న‌ట్టు తెలుస్తోంది. టీజర్, విజువల్స్ ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. అయితే ఈ సినిమా తెలుగులో విడుద‌ల‌య్యేట‌ట్టు క‌నిపించ‌డం లేదు. ఇప్ప‌టివ‌ర‌కు ఆ చిత్ర బృందం నుంచి ఎలాంటి ప్ర‌క‌ట‌న లేదు. నిహారిక న‌టిస్తుండ‌డంతో త‌ప్ప‌నిస‌రిగా ఈ సినిమాను తెలుగు డ‌బ్బింగ్‌తో విడుద‌ల చేసే అవ‌కాశం ఉంది.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -