Monday, May 20, 2024
- Advertisement -

తల్లి చాటు కొడుకు.. నిఖిల్!

- Advertisement -

టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ గురించి ఓ డిఫరెంట్ యాంగిల్ వెలుగుచూసింది. సినిమాల్లో క్యారెక్టర్ల విషయం పక్కన పెడితే.. బయట మాత్రం కాస్త అల్లరి చిల్లరగా.. అంటే ఇప్పటి యూత్ ఎలా ఉంటారో అలా కనిపించే నిఖిల్ లో.. తల్లి చాటు కొడుకు కూడా ఉన్నాడు.

అసలు విషయం ఏంటంటే.. డిఫరెంట్ కాన్సెప్ట్ లతో వరుస విజయాలు దక్కించుకుంటున్న నిఖిల్.. వాళ్ల అమ్మకు ఓ ప్రామిస్ చేశాడట. సినిమాల్లోకి వస్తా అంటే వద్దు అనకుండా.. కండిషన్స్ అప్లై అని చెప్పిన అమ్మకు.. నిఖిల్ సరే అన్నాడట.

ట్రెడీషనల్ ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీలోకి వచ్చిన నిఖిల్ కు.. ముందు ఫ్యామిలీ నుంచే.. ఇంకా చెప్పాలంటే అతని అమ్మ నుంచే కొన్ని డిమాండ్లు ఎదురయ్యాయని టాక్. హీరోయిన్లతో లిప్ లాక్ లకు దూరంగా ఉండాలన్న కండిషన్ కు నిఖిల్ ఓకే చెప్పాడంట.

అందుకే ఇప్పటివరకూ నిఖిల్ సినిమాల్లో ఎక్కడా హీరోయిన్లతో అంత క్లోజ్ గా ఉన్న సీన్లు కనిపించలేదు. ఇక ముందు కూడా ఇదే రూట్ ఫాలో అవుతాడట నిఖిల్.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -