Wednesday, May 1, 2024
- Advertisement -

పాపం.. టీడీపీ ని రక్షించడానికి ఆ పత్రికల పాట్లు ఎన్నో!

- Advertisement -

పత్రిక ప్రయారిటీలు.. అవి హైలెట్ చేసే కథనాలు.. అన్నీ వ్యూహాత్మకమే! ఆ పత్రికల అజెండాకు తగ్గట్టుగానే వాటిల్లో వార్తలు వస్తాయని వేరే వివరించనక్కర్లేదు.

అయితే రాజకీయ రహితమైన కథనాల్లో కూడా రాజకీయాన్ని జొప్పించడం తెలుగునాట మేటి పత్రికలకు ఉన్న మేధస్సుకు నిదర్శనం. అయితే వాటికి ఈ తీరు కొత్తేమీ కాదు.. వాటి చరిత్రను పరిశీలించి చూస్తే… ఇలాంటి వ్యవహారాలెన్నో కనిపిస్తాయి. అయితే సదరు పత్రికలు ఎప్పటికప్పుడు తమ మేధస్సును పాఠకుల ముందు ప్రదర్శిస్తూ ఉంటాయి. 

తమ వాళ్లను రక్షించుకోవడంలో అపద్ధర్మంగా కొన్ని రకాల కథనాలను ఎంచుకొని ఆ పత్రికలు తమ తెలివితేటలను అందరికీ అర్థమయ్యేలా చేస్తుంటాయి. సదరు పత్రిక తన పాఠకులను తప్పుదోవ పట్టించడానికి చేసే ప్రయత్నాలే కామెడీ కామెడీగా ఉన్నాయి.

ఉదాహరణకు తెలుగులో అత్యధిక సంచికలు అమ్ముడుపోయే ఒక పత్రికను తీసుకొంటే.. ఏపీలో కాల్ మనీ వ్యవహారం వార్తల్లోకి ఎక్కగానే తన పంథాను మార్చింది. అధికార పార్టీ ఎమ్మెల్యేల, ఎంపీల భాగస్వామ్యం ఉందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్న తరుణంలో… కొంతమంది ఎంపీలు, కేంద్రమంత్రులు.. కాల్ మనీ కీచకులను రక్షించడానికి ప్రయత్నాలు చేస్తున్నారనే వార్తలు వస్తున్న తరుణంలో… సదరు పత్రిక కాయగూరలు విషతుల్యం కావడం గురించి ప్రత్యేక కథనాలను వండింది. 

అయితే… గత రెండు మూడేళ్లలో.. పాలూ, కాయగూరలు విషతుల్యం కావడం గురించి తెలుగు మీడియా వార్తాకథనాలను అరగదీసింది. ఈ రోజు హాట్ టాపిక్ ఏమిటో… దాని గురించి సింగిల్ పీస్ వార్త ఇవ్వకుండా.. కాయగూరల గురించి కథనమళ్లి.. తెలుగు ప్రజలంతా దాని గురించి మాత్రమే ఆందోళన చెందాలి అనే అజెండాను అమలు చేసింది ఆ పత్రిక! తను జాకీలు వేసి ఎత్తిన రాజకీయ పార్టీ పరువుకు అంగవస్తంలా మారి తన పాఠకులకు వేరే ప్రపంచాన్ని చూపెట్టే ప్రయత్నం చేసింది. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -