Thursday, May 2, 2024
- Advertisement -

‘ముద్ర’ గ‌ట్టిగానే ప‌లికిందిగా..!

- Advertisement -

టాలీవుడ్ యువ హీరో నిఖిల్ వ‌ర‌స హిట్ల‌తో మంచి జోష్‌లో ఉన్నాడు.ఇంకా చెప్పాలంటే నిఖిల్‌తో పాటు వ‌చ్చిన హీరోలు అంద‌రు ఎక్క‌డ క‌నిపించ‌డం లేదు.కాని నిఖిల్ మాత్రం వైవిధ్య‌మైన క‌థ‌ల‌ను ఎంచుకుంటు స‌క్సెస్ సాధిస్తున్నాడు.తాజాగా నిఖిల్ హీరోగా న‌టిస్తున్న సినిమా ముద్ర. ఈ సినిమా త‌మిళ సినిమాకు రీమేక్‌.లావణ్య త్రిపాఠి కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమా షూటింగు హైదరాబాద్ లోని ఒక టీవీ స్టూడియోలో జరుగుతోంది.

ఈ సినిమాలో నిఖిల్ .. అర్జున్ అనే జర్నలిస్ట్ పాత్రలో కనిపించనున్నాడు. యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందుతోన్న ఈ సినిమాపై అంచనాలు బాగానే వున్నాయి. దీంతో ఈ సినిమా శాటిలైట్ రైట్స్‌కి భారీ డిమాండ్ ఏర్ప‌డింది.తెలుగు,హిందీ శాటిలైట్ రైట్స్ ను అయిదున్నర కోట్లకు అమ్మినట్టుగా సమాచారం. త్వరలోనే ఈ సినిమా టీజర్ ను విడుదల చేయనున్నారు. నిఖిల్ ఈ సినిమా కూడా వైవిధ్యంగా ఉంటుంద‌ని ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు భావిస్తున్నాయి.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -