Sunday, May 19, 2024
- Advertisement -

‘కిరాక్‌పార్టీ’ పోటీలో గెలిస్తే కారు మీ సొంతం..

- Advertisement -

విభిన్నంగా నిఖిల్ సినిమా ప్ర‌చార కార్య‌క్ర‌మాలు

విభిన్న క‌థాంశాల‌తో సినిమాలు చేస్తున్న యువ న‌టుడు నిఖిల్ సిద్ధార్థ్ ఇప్పుడు ‘కిరాక్‌పార్టీ’ సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్నాడు. నిఖిల్‌, సిమ్రాన్‌ పరింజ, సంయుక్తా హెగ్డే ప్ర‌ధాన పాత్ర‌ల్లో క‌న్న‌డ సినిమా ‘కిరాక్‌ పార్టీ’ను రీమేక్ చేసి శరణ్‌ కొప్పిశెట్టి దర్శకత్వంలో సినిమా రూపొందించారు. ఈ సినిమా షూటింగ్ పూర్త‌యి విడుద‌ల‌కు సిద్ధ‌మైంది.

అయితే ఈ సినిమా క‌థాంశం వ‌చ్చేసి శివ‌, హ్యాపీడేస్ సినిమాల‌ను క‌లిపి విభిన్నంగా తెర‌కెక్కించిన‌ట్లు చిత్ర‌బృందం తెలిపారు. రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ సినిమా మార్చి 16వ తేదీన సినిమా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. సినిమా ప్ర‌చారంలో భాగంగా మార్చి 8వ తేదీ నుంచి తెలుగు రాష్ట్రాల్లో చిత్ర‌బృందం ప‌ర్య‌టించ‌నుంది. నిఖిల్‌కు 15వ సినిమా ఇది. యూత్‌ఫుల్ క‌థాంశాల‌కు నిఖిల్ ప‌ర్ఫెక్ట్ సూట‌వుతుండ‌డంతో ఈ సినిమాను రూపొందించారు. ఈ సినిమా విజ‌యంపై నిఖిల్ ధీమాగా ఉన్నాడు. అయితే ఈ సినిమా ప్రచారంలో భాగంగా ఓ పోటీని నిర్వహిస్తున్నారు. ఆ పోటీ ఏమిటో ప్ర‌క‌టించ‌లేదు. కానీ ఆ పోటీలో గెలుపొందిన వారిని సినిమాలో ఉప‌యోగించిన కారును తొలి బహుమతిగా ప్ర‌క‌టించ‌నున్నారు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -