ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న భారీ మల్టీస్టారర్ సినిమా కోసమే రామ్‌చరణ్, ఎన్టీఆర్ అమెరికాకు వెళ్లినట్లు తెలుస్తోంది. మంగళవారం రాత్రి హైదరాబాద్‌లోని శంషాబాద్ విమానాశ్రాయంలో రామ్‌చరణ్, ఎన్టీఆర్ కనిపించారు. వారిద్దరూ కలిసి ఉన్న ఫొటోలు టాలీవుడ్లో హాట్ టాపికవడంతో వారిద్దరూ ఎక్కడికెళ్లారు.. ఎందుకు ఎళ్లారు.. అని ప్రశ్నలు మొదలయ్యాయి. వీటికి సమాధానం లభించింది.
రాజమౌళి దర్శకత్వంలో రూపొందే సినిమా కోసం చెర్రీ, తారక్ అమెరికాకు బయల్దేరారట. అమెరికాలో ఫొటో షూట్ రెండు రోజుల పాటు చేసిన తర్వాత ఆ తర్వాత చెర్రీ, తారక్ వారి మిగతా సినిమాలతో బిజీ కానున్నారు. అయితే ఈ సినిమాను డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై డి.వి.వి.దానయ్య నిర్మిస్తాడని సమాచారం. ప్రస్తుతం స్క్రిప్టు పనులు వేగంగా కొనసాగుతున్నాయి.
రామ్‌చరణ్, ఎన్టీఆర్ అమెరికాకు రాజమౌళి తనయుడు కార్తికేయతో కలిసి అమెరికాకు వెళ్లారు. అక్కడ రెండు రోజుల పాటు ఈ ఫొటో షూట్ కొనసాగనుంది. తిరిగొచ్చాక బోయపాటి శ్రీను సినిమాతో రామ్‌చరణ్, త్రివిక్రమ్ సినిమాతో ఎన్టీఆర్ బిజీ అవుతారు. వీరిద్దరూ ఈ రెండు సినిమాలు పూర్తయిన తర్వాత రాజమౌళికి ఫుల్‌టైమ్ కేటాయించనున్నారు. అయితే రాజమౌళి సినిమాల్లో ఎన్టీఆర్ పక్కన రాశీఖన్నా, రామ్‌చరణ్ పక్కన సమంత హీరోయిన్గా నటించనున్నారని తెలుస్తోంది.
