Sunday, May 5, 2024
- Advertisement -

‘అఖిల్’ పీడకల… నష్టాలు లెక్కలు ఇవే…!

- Advertisement -

సాధారణంగా ఏ భారీ సినిమా అయినా విడుదల అయితే.. అదితొలి వారంలో ఎంత వసూలు చేసింది, రెండో వారానికి ఎక్కడకు చేరింది.. ఓవరాల్ గా ఎంత సంపాదించి పెడుతుంది? అనే అంశం గురించి చర్చ జరుగుతూ ఉంటుంది.

అయితే అక్కినేని వారబ్బాయ్ గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చిన సినిమాకు మాత్రం నష్టాల లెక్కల గురించే ఎక్కువగా చర్చ జరుగుతోంది. భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా బయ్యర్లకు భారీ నష్టాలనే మిగిల్చింది. ఈ నేపథ్యంలో ఆ లెక్కలే ఇప్పుడు ప్రధానం అయ్యాయి.ఒక అంచనా ప్రకారం ఇప్పటి వరకూ అఖిల్ సినిమా దాదాపు 16 కోట్ల రూపాయల వసూళ్లను సాధించింది.

ఫస్ట్ వీక్ కు సినిమా ఆ స్థాయిలో నిలబడింది. మరి సినిమాకు పెట్టిన బడ్జెట్ తో పోలిస్తే ఇది చాలా తక్కువ మొత్తమే. బీభత్సమైన నెగిటివ్ టాక్ ఈ సినిమాను దెబ్బ తీసింది. ఇకపై కూడా ఈ సినిమా ఏదో సంపాదించేసే అవకాశాలు తక్కువే. దీంతో సినిమాను కొన్న బయ్యర్లకు దాదాపుగా 60 శాతం నష్టాలు తప్పవని చెబుతున్నారు. మరీ ఈ స్థాయి నష్టాలను మిగిల్చిన సినిమాలేవు ఈ మధ్య. 

ఏపీలో ఈ సినిమాను విడుదల చేసిన బయ్యర్లు కనీసం 40 శాతం రిటర్న్స్ తో అయినా బయటపడ్డారు. ఓవర్సీస్ లో అఖిల్ తో గోక్కొన్న వారికి  మరిన్ని నష్టాలే అని తెలుస్తోంది. ముందస్తు అంచనాలతో ఈ సినిమాపై భారీగా ఇన్వెస్ట్ చేసిన బయ్యర్లకు పీడకలే మిగిలిందని సమాచారం. ఏకంగా 90 శాతం నష్టాలు వచ్చాయని టాక్! పెట్టిన పెట్టుబడిలో కనీసం పదో వంతు కూడా కళ్ల చూడలేకపోతున్నారని యూఎస్ బయ్యర్ల గురించి వార్తలు వస్తున్నాయి! 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -