Sunday, May 19, 2024
- Advertisement -

మంత్రుల మీద , అధికారులమీద గుస్సా అయిన చంద్రబాబు

- Advertisement -

మనకి అందుతున్న విశ్వసనీయసమాచారం ప్రకారం తాజాగా జరిగిన ఏపీ కాబినెట్ భేటీ లో చంద్రబాబు ఆగ్రహాన్ని చాలామంది మంత్రులతోపాటు ఉన్నత అధికారులు కూడా చవి చూసారట. ఒకరిద్దరు మంత్రుల మీద కోపం వ్రేళ్ళగక్కే ముఖ్యమంత్రి ఇప్పుడు అందరినీ టార్గెట్ చేసి ఒక సీరియస్ వార్నింగ్ ఇచ్చారు అని చెబుతున్నారు.

చాలా విషయాల్లో మంత్రుల మీద గుస్సా అయ్యారట చంద్రబాబు. కాబినెట్ సమావేశంలో చాల ఆసక్తికర నిర్ణయాలు తీసుకున్న బాబు అసహనానికి గురయ్యరత. విశాఖ మన్యం జిల్లాల్లో బాక్సైట్ తవ్వకాల కి సంబంధించిన ప్రభుత్వం అనుమతులు ఇవ్వడం దాని మీద గిరిజనులు సీరియస్ గా ఉండడం తెలిసిందే. దీనికి పవన్ కళ్యాణ్ కలిసి మరీ ఫీడ్ బ్యాక్ ఇవ్వడం తో బాక్సైట్ విషయం ప్రముఖంగా చర్చకి వచ్చింది అంటున్నారు.

బాక్సైట్ తవ్వకాలకు సంబంధించి ఎవరు అనుమతి ఇచ్చారంటూ ప్రశ్నించిన చంద్రబాబు.. ఈ విషయంపై మీకు సమాచారం ఉందా అని అటవీశాఖామంత్రి బొజ్జల గోపాల కృష్ణారెడ్డితో పాటు.. మరో మంత్రి గంటా శ్రీనివాసరావును ప్రశ్నించగా.. తమకు ముందుగా తెలీదని చెప్పటంతో బాబు సీరియస్ అయినట్లు తెలుస్తోంది.  

గిరిజనులకి ఇష్టం లేని నిర్ణయాలు ఎలా తీసుకున్నారు అని అడిగారట ఆయన. ప్రభుత్వం పైన ప్రభావం పడే ఇలాంటి అంశాలని ఏ రకంగా కూడా తాను సహించను అని అలాంటివి తనకి చెప్పకుండా నిర్ణయం తీసుకునే హక్కు అధికారులకి లేదు అని బాబు సీరియస్ వార్నింగ్ ఇచ్చారట. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -