Thursday, May 16, 2024
- Advertisement -

ఏపీ కి ప్రత్యేక ప్యాకేజీ వచ్చేస్తోందహో ….

- Advertisement -

నమో నమో అంటూ 2014 లో దేశం యావత్తూ మోడీ కి బ్రహ్మరధం పట్టగా తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ జనాలు కూడా అలాగే నీరాజనాలు పట్టారు. ఏపీ లో వారి మిత్రపక్షం అయిన టీడీపీ కే పట్టం కట్టి వారి గెలుపుకు కేంద్రం లో ఎంపీలని సైతం సిద్దం చేసారు మనవారు.

రాష్ట్రాన్ని కాంగ్రెస్ అడ్డంగా చీల్చింది అన్న కోపమో , బీజేపీ నే కొత్త ఆశాకిరణం అనే ఆలోచన కావచ్చు గాక మోడీ ని నెత్తిన పెట్టుకున్నారు మనవాళ్ళు కూడా. ఏపీ లో బీజేపీ తరఫున ఇప్పుడు వకాల్తా పుచ్చుకున్న నాయకులనే కానీ టీడీపీ ప్రభుత్వాన్నే కానీ జనాలందరూ అడుగుతున్నా ఒకే ఒక్క ప్రశ్న ‘ ప్రత్యేక హోదా ‘ . ప్రత్యేక హోదా లేదా ప్యాకేజీ అనేది బీజేపీ నుంచి ఒక విస్పష్టమైన హామీగా ఆంధ్రా కి రావాల్సి ఉంది. కానీ ఎలాంటి అడ్డంకులు ఎదురు అవుతున్నాయో కూడా తెలియని పరిస్థితి లో ఆ రెండిటి మీద సరైన క్లారిటీ రావడం లేదు.

అయితే బీహార్ ఎన్నికల తరవాత ఎలాగైనా ఏపీ కి బీజేపీ హోదా కాకపోయినా ఖచ్చితంగా ప్యాకేజీ ఇచ్చేస్తుంది అని లోకల్ బీజేపీ నాయకులు ప్రకటించారు అప్పట్లో. అది త్వరాలో సాకారం అవబోతోంది అని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం నరేంద్ర మోడీ తన విదేశీ పర్యటన పూర్తి చేసుకున్నారు. ఇప్పుడు ఇక ఆయన తదుపరి దృష్టి ప్రత్యేక ప్యాకేజీ విషయం మీదనే అని అంటున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ తరఫున ఓ భారీ బహిరంగ సభకు ప్లాన్‌ చేయించి, ఆ వేదిక పైనుంచి నరేంద్రమోడీ, చంద్రబాబు నాయుడూ, వెంకయ్య నాయుడూ స్వయంగా నిలబడి

మరీ ఈ ప్యాకేజీ ని ప్రకటిస్తారు అని తెలుస్తోంది. నిజానికి అమరావతి శంకుస్థాపన రోజునే ఈ విషయం మీద ఒక క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. ఇలా అధికారిక వేదికల మీద దేనికి ఒక ప్రత్యేక పార్టీ కి సంబంధించిన వేదిక ఏర్పాటు చేసుకుని బీజేపీ తరఫున దీన్ని ప్రకటించి ఆ గొప్పతనం పార్టీ ఖాతాలో వేసుకోవాలి అనేది అమిత్ షా ప్లాన్. పార్టీ వేదికల మీద ప్రకటించడం ద్వారా పార్టీకి ఏపీ లో ఎక్కడ లేని బలం వస్తుంది అని ప్లాన్ లో ఉన్నారు. ఎన్నికల నేపధ్యం లో బీహార్ కీ కాశ్మీర్ కి రెండేసి ప్రత్యేక ప్యాకేజీలు చెప్పేసిన నరేంద్ర మోడీ సమయం మించిపోతున్న తరుణంలో ఏపీ కి ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించి తీరాల్సి ఉంది.

బీహార్ లో చావుదెబ్బ తిన్న తరవాత ఎదో ఒక చిన్నా చితకా ప్యాకేజీ అయినా ఏపీ కి ప్రకటించి తీరాలి అని ఆలోచిస్తోంది బీజేపీ ప్రభుత్వం. ఈ విషయంలో ఇంత ఘంటాపదంగా చెప్పడానికి కారణం వెంకయ్యనాయుడు గారు. గుంటూరు లో జరిగిన వ్యవసాయ విశ్వ విద్యాలయ శంకుస్థాపన కార్యక్రమం లో ” కేంద్ర ఇవ్వబోతున్న సాయం” అంటూ కొన్ని చోట్ల ఉచ్చరించారు ఆయన. దీని బట్టి ఆ ప్యాకేజీ ఎదో సిద్దం అవుతున్నట్టు కనిపిస్తోంది. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -