Thursday, April 25, 2024
- Advertisement -

ప్రేమికుల‌కు కానుక ఇచ్చిన హీరో నితిన్‌

- Advertisement -

ప్రేమికుల దినోత్స‌వం సందర్భంగా హీరో నితిన్ ల‌వ‌ర్స్‌కు గిఫ్ట్‌ ఇచ్చాడు. తన సినిమా టీజ‌ర్‌తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు. కృష్ణ చైత‌న్య ద‌ర్శ‌క‌త్వంలో నితిన్ న‌టిస్తున్న ‘చల్‌ మోహన రంగ’ సినిమా టీజర్‌ను విడుదల చేశారు. శ్రేష్ట్‌ మూవీస్, పవన్‌ కల్యాణ్‌ క్రియేటివ్‌ వర్క్స్‌ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. నితిన్ న‌టిస్తున్న 25వ సినిమాకు దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాకు కథ అందించారు. తమన్ మ్యూజిక్‌లో వ‌స్తున్న ఈ సినిమా టీజ‌ర్‌లో నితిన్ కొత్త‌గా క‌నిపిస్తున్నాడు.

టీజర్‌లో తన ప్రేమకథను చెప్పమ‌ని అడ‌గ్గా.. ‘వర్షాకాలం కలుసుకున్న మేం, శీతాకాలంలో ప్రేమించుకొని.. వేసవికాలంలో విడిపోయాం’ అంటూ తన లవ్‌స్టోరిని చెప్పాడు. మీరిద్ద‌రూ వెద‌ర్ రిపోర్ట‌ర్సా భ‌య్యా అని వెట‌కారంగా అంటే నితిన్ వార్నింగ్ ఇస్తున్న‌ట్లు క‌నిపిస్తాడు. ఈ టీజర్‌లో నితిన్‌ కూల్‌ లుక్‌ తోపాటు, మేఘా ఆకాశ్‌ అందంగా కనిపిస్తోంది. వీరిద్ద‌రూ గ‌తంలో లై సినిమాలో క‌నిపించారు. అయితే ఆ సినిమా కొంచెం నిరాశ ప‌రిచింది. ఆ త‌ర్వాత వీరిద్ద‌రూ చేస్తున్న ఈ సినిమా ఇదే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -