Saturday, May 18, 2024
- Advertisement -

శివ శివా……… జోకర్స్ పచ్చ వేషాలు అన్నీ ఇన్నీ కాదయా……

- Advertisement -

మోకాలికి బోడి గుండుకి ముడిపెట్టాలంటే పచ్చ బ్యాచ్ తర్వాతే ఎవరైనా. రామ్ గోపాల్ వర్మ చేసిన, చేస్తున్న విమర్శలు ఏంటి? టిడిపి ఎంపిలు తమ జోకర్ వేషాలు సమర్థించుకోవడానికి పడుతున్న పాట్లు ఏంటి? అన్ని విషయాల్లోనూ వీళ్ళ తీరు ఇంతేనా? కేబినెట్ మంత్రిగా ఉండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేసేలా ఉన్న బడ్జెట్ ప్రతిపాదనలను టిడిపి కంద్ర మంత్రి సుజనా చౌదరి ఎలా ఆమోదించాడు? బడ్జెట్‌ని ఆమోదించిన అదే మంత్రి ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో వచ్చిన ఆగ్రహావేశాలకు చంద్రబాబు బలవ్వకుండా ఉండడం కోసం అదే బడ్జెట్‌ని విమర్శిస్తూ అన్యాయం అంటూ మాట్లాడడం ఏంటి? ఆ విషయాన్ని నిజాయితీగా ప్రశ్నించిన విజయసాయిరెడ్డిని సీమాంధ్ర ద్రోహి అంటూ పచ్చ బ్యాచ్ శివాలెత్తిపోవడం ఏంటి? తల్లిదండ్రులను చంపేసిన కొడుకే ….. తల్లీతండ్రి లేని అనాథనయ్యా……కాస్త కరుణించండి అని కోర్టులో మొరపెట్టుకున్న చందంగా బాబు తీరు ఉంటుందని జగన్ ఎప్పుడూ చెప్తూ ఉంటాడు. ఇప్పుడు టిడిపి చేస్తున్నది కూడా అదే కాదా. బడ్జెట్ ప్రతిపాదనలను కేబినెట్ మీటింగ్‌లో టిడిపి కేబినెట్ మంత్రులు సుజనా చౌదరి, అశోక్ గజపతి రాజులు ఆమోదిస్తారు. అంటే ఆంధ్రప్రదేశ్‌కి చిప్పేగతి అన్నట్టుగా ఉన్న బడ్జెట్‌ని బాబు సారథ్యంలోని టిడిపినే ఆమోదించినట్టు లెక్క. మళ్ళీ అదే బడ్జెట్‌లో రాష్ట్రానికి అన్యాయం జరిగిందని వీళ్ళే శివాలెత్తిపోతారు.

టిడిపి ఎంపీల ఈ జోకర్ వేషాలపై రామ్ గోపాల్ వర్మ పంచ్‌లు వేశాడు. సూటిగా సమాధానం చెప్పలేని టిడిపి ఎంపిలు అడ్డదిడ్డంగా మాట్లాడేశారు. టిడిపి ఎంపి శివప్రసాద్ సమర్థించుకున్న విధానం అయితే మరీ ఘోరం. ఓ కళాకారుడిగా జోకర్ వేషం వేశాను, అందరినీ ఆకర్షించాను, జోకర్ అంటే విజేత, నేను జోకర్‌గా సక్సెస్ అయ్యాను, పేకాటలో జోకర్‌ని చాలా గొప్పగా చూస్తారు అంటూ ఏదేదో కామెడీగా చెప్పుకుపోయాడు. బహుశా బాలయ్య పూనాడో ఏమో తెలియదు. శివప్రసాద్‌కి అర్థం కావాల్సిన విషయం ఏంటంటే……వర్మ అంటున్నది కూడా అదే. జోకర్స్‌గా సక్సెస్ అయ్యారు. కానీ ఎంపిలుగా ఏం పీకారు అనే అడుగుతున్నాడు. శివప్రసాద్ కళాకారుడనో, టిడిపి ఎంపిలు జోకర్స్‌గా గొప్ప ప్రతిభావంతులనో వాళ్ళను ఆంధ్రప్రదేశ్ ప్రజలు పార్లమెంట్‌కి పంపించలేదుగా. ప్రజల సమస్యలను పరిష్కరిస్తారని లేదా ఆ సమస్యలపై పోరాడతారని. ఆ విషయాన్ని గాలికొదిలేసి జోకర్ వేషాలు, కామెడీ వేషాలు వేసుకుంటూ పార్లమెంట్ సాక్షిగా తెలుగువారిని నవ్వుల పాలు చెయ్యడంపైనే రామ్ గోపాల్ వర్మ ప్రశ్నిస్తున్నాడు. కానీ టిడిపి ఎంపిలు మాత్రం జోకర్స్‌గా సక్సెస్ అయ్యాం కదా అని వాదిస్తున్నారు. విభజన నాడు కూడా ఇవే జోకర్ వేషాలతో సీమాంధ్రులను నిండా ముంచారు. ఇప్పుడు కూడా అవే డ్రామాలు. ఇక 2019లో కూడా సీమాంధ్రప్రజలు జోకర్స్‌గా సక్సెస్ అయ్యామంటున్న ఈ టిడిపి ఎంపిలకే పట్టం కట్టి నవ్వులపాలవుతారేమో చూడాలి మరి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -