Monday, May 20, 2024
- Advertisement -

వీడిన ‘గోనెసంచి’ మ‌ర్డ‌ర్ కేసు

- Advertisement -

రోడ్డు ప‌క్క‌న గోనెసంచిలో ఓ మ‌హిళ మృతదేహం ముక్కలుముక్కులుగా ప‌డి ఉండ‌డం… అతి కిరాత‌కంగా పార్టులు పార్టులుగా న‌రికేయ‌డం చూస్తుంటే ఒళ్లు గ‌గుర్పొడిచే ఘ‌ట‌న హైద‌రాబాద్‌లో సంచ‌ల‌నం సృష్టించింది. నిండు గ‌ర్భిణిని హ‌త‌మార్చి రోడ్డుపై శ‌వాన్ని ప‌డేసి వెళ్ల‌డం తెలంగాణ పోలీసులు ప్ర‌తిష్టాత్మ‌కంగా ఈ కేసును భావించారు. ఈ కేసును ఎలాగైనా చేధించాల‌ని ప‌లు బృందాల‌తో క‌లిసి ఈ కేసులో పురోగ‌తి సాధించారు. కేసు విచార‌ణ‌లో తేలిందంటే వివాహేత‌ర సంబంధ‌మే కార‌ణంగా తేలింది. 8 నెలల గర్భిణిని వివాహేతర సంబంధం, ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులతోపాటు, ఆమెతో సహ జీవనం చేస్తున్న వ్యక్తి అంతమొందించాడు. ఆ వివ‌రాలు చ‌ద‌వండి..

బిహార్‌లోని మోహోనమల్తీకి చెందిన అనిల్‌ఝా (75), మమత ఝా(37) భార్యభర్తలు. వీరి కుమారుడు అమర్‌కాంత్ ఝా (21) హైద‌రాబాద్‌లో ఓ ప‌బ్‌లో ప‌ని చేస్తున్నాడు. ఆ త‌ర్వాత ఉపాధి నిమిత్తం హైదరాబాద్‌కు అనిల్‌, మ‌మ‌త వచ్చి గచ్చిబౌలి సిద్ధిఖీనగర్‌లో ఉంటున్నారు. అనిల్‌, మమత గప్‌చుప్‌ బండి నిర్వ‌హిస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం సంభాల్‌ జిల్లా చందౌసీకి చెందిన వికాస్‌ కశ్యప్ (35) వీరింట్లోనే ఉంటూ గప్‌చుప్‌ బండి వద్ద పని చేస్తున్నాడు. అయితే వికాస్‌తో మ‌మ‌త‌కు వివాహేత‌ర సంబంధం ఏర్ప‌డింది. ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌కు చెందిన పింకీ త‌న భ‌ర్త‌తో విబేధాలు ఏర్ప‌డి ఒంట‌రైంది. ఈ నేప‌థ్యంలో వికాస్‌తో పింకీకి ప‌రిచ‌యం ఏర్ప‌డింది. వీరిద్ద‌రూ స‌హ జీవ‌నం చేస్తున్నారు. ఈ క్ర‌మంలో త‌మ ఇంటి ప‌క్క‌న ఉండే మ‌మ‌త‌తో వివాహేత‌ర సంబంధం ఏర్ప‌డింది.

ఈ బంధం కార‌ణంగా మ‌మ‌త కోసం హైద‌రాబాద్‌కు వికాస్ వ‌చ్చాడు. కొన్నాళ్ల‌కు పింకీ వికాస్ కోసం హైద‌రాబాద్ వ‌చ్చింది. వికాస్‌ను పెళ్లి చేసుకోమ‌ని అడ‌గ్గా నిరాక‌రించాడు. పైగా మ‌మ‌తతో ఉన్న బంధం దెబ్బ‌తింటుంద‌ని భావించాడు. మ‌మ‌త‌తో ఇదే విష‌య‌మై మాట్లాడాడు. అయితే మ‌మ‌త‌ను హ‌త‌మార్చాల‌ని ఇద్ద‌రూ నిర్ణ‌యించారు.

జ‌న‌వ‌రి 27వ తేదీ రాత్రి పింకీతో మమత, వికాస్ గొడవపడ్డారు. ఈ క్ర‌మంలో మ‌మ‌త 8 నెల‌ల గ‌ర్భ‌వ‌తి పింకీ తలను గట్టిగా పట్టుకొని గోడకేసి బాదింది. వీపు, కడుపు భాగంలో తీవ్రంగా కొట్టడంతో ఆమె మృతి చెందింది. ఇదే క్రమంలో ఆమెకు గర్భస్రావమైంది. మ‌మ‌త కొడుకు అమర్‌కాంత్‌, వికాస్ మృతదేహాన్ని స్నానాలగదిలో ఉంచారు. మరుసటి రోజు స్టోన్ కట్టర్‌తో పింకీ మృత‌దేహాన్ని ఎనిమిది ముక్కలుగా కోసి రెండు గోనెసంచుల్లో మూటకట్టారు. చెత్తను వేసే ప్రదేశంలో పడేస్తే జీహెచ్‌ఎంసీ సిబ్బంది తీసుకెళ్తారని భావించి 29వ తేదీ తెల్లవారుజామున బొటానికల్‌ గార్డెన్‌ సమీపంలో పడేశారు.

ఆ త‌ర్వాత ఏం జ‌రిగిందో అంద‌రికీ తెలిసిందే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -