Friday, May 3, 2024
- Advertisement -

తెలంగాణలో పోటీకి టీడీపీ దూరం..బాలయ్య సెన్సేషన్!

- Advertisement -

తెలంగాణలో తెలుగు దేశం పార్టీ పోటీ చేస్తుందని టీటీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ప్రకటించిన 24 గంటల్లోపే మరో ఆసక్తికర న్యూస్ వైరల్‌గా మారింది. తెలంగాణ ఎన్నికల రేసు నుండి టీడీపీ తప్పుకుందని సమాచారం. ఇదే విషయాన్ని టీటీడీపీ అధ్యక్షుడికి తేల్చిచెప్పారట నందమూరి బాలకృష్ణ.

వాస్తవానికి టీడీపీ తెలంగాణలో పోటీ చేస్తుందని కొద్ది రోజుల క్రితం స్వయంగా ప్రకటించారు బాలయ్య. ఇదే విషయాన్ని కాసాని జ్ఞానేశ్వర్ మీడియా సమావేశం పెట్టి మరి వెల్లడించారు. 88 స్ధానాల్లో టీడీపీ పోటీ చేస్తుందని బాలకృష్ణ ప్రచారం నిర్వహిస్తారని చెప్పారు. అయితే తెలంగాణలో పోటీపై కాసాని ప్రకటించినా…టీడీపీ చీఫ్ చంద్రబాబు నుండి గ్రీన్ సిగ్నల్ రాలేదట. నారా లోకేష్ సైతం చంద్రబాబు బెయిల్ పైనే ఫోకస్ చేస్తుండటం, పలు అవినీతి కేసుల్లో లోకేష్ పేరు సైతం వినిపిస్తుండటంతో టీటీడీపీ పోటీపై ఎలాంటి నిర్ణయానికి రాలేదట.

ఇక ఇదే విషయాన్ని బాలయ్య స్వయంగా కాసానితో మాట్లాడారని సమాచారం. తెలంగాణలో పోటీపై అఫిషియల్ నిర్ణయం వచ్చే వరకు వేచిచూడాలని చెప్పారట. దీంతో టీటీడీపీ పోటీపై సందిగ్దం నెలకొనగా తెలంగాణ తెలుగు తమ్ముళ్లు తీవ్ర అసహనం వ్యక్తం చేసే పరిస్థితి నెలకొంది. బాలయ్య తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పార్టీని వీడేందుకు సిద్ధమవుతున్నారు పలువురు నేతలు.

సీనియర్ నేత రావుల చంద్రశేఖర్ రెడ్డి బీజేపీ వైపు చూస్తుండగా ఈయన బాటలోనే మరికొంతమంది ఉన్నట్లు సమాచారం. ప్రస్తుత పరిస్థితుల్లో టీడీపీ నేతల ముందు అనేక సవాళ్లు ఉన్నాయి. చంద్రబాబు జైల్లో ఉండటం…పలు కేసులు న్యాయపరమైన సమస్యలతో లోకేష్ ప్రచారం నిర్వహించలేని పరిస్థితి. ఒక వేళ తెలంగాణలో పోటీ చేస్తే ప్రచార బాధ్యతలు ఎవరు తీసుకుంటారో తెలియని పరిస్థితి. అలాగే ఏపీ బాధ్యతలను వేరే వారి చేతిలో పెట్టడానికి చంద్రబాబు సిద్ధంగా లేరు. ఈ క్రమంలోనే డైలామాలో ఉన్న టీడీపీ నేతలు తెలంగాణలో పోటీపై క్లారిటీకి రావడం లేదు. ఒక వేళ పోటీకి దూరంగా ఉంటే ఇకపై టీడీపీ జాతీయ పార్టీ అని చెప్పుకునే పరిస్థితి ఉండదు. సో తెలంగాణ ఎన్నికల సంగతేమో కానీ టీడీపీ పరిస్థితి మాత్రం అడకత్తెరలో పొకచెక్కలా తయారైందని అంతా భావిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -