ఇక కండోమ్ యాడ్స్ కు బ్రేక్ పడనుంది. ఏ సమయంలో అయినా… టీవీల్లో వచ్చేసి హల్ చల్ చేసే యాడ్స్ ను ప్రభుత్వం నియంత్రించాలని భావిస్తోంది.
అయితే పూర్తి గా కాదు… కొంత మేర మాత్రమే! ప్రత్యేకించి చిన్న పిల్లలు టీనేజర్లు ఎక్కువగా టీవీలు చూసే సమయంలో కండోమ్ యాడ్స్ ను ప్రదర్శించకూడదని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అయితే అలాంటి యాడ్స్ ను పూర్తిగా నియంత్రించకుండా..
కొంత సమయం మేర వాటి ప్రదర్శనకు అవకాశం వచ్చింది. అది కూడా పొద్దు పోయాకా మాత్రమే!
రాత్రి పదకొండు తర్వాత ఇలాంటి యాడ్స్ ను ప్రదర్శించుకోవచ్చని కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. రాత్రి పదకొండు నుంచి తెల్లవారుజామున ఐదు గంటల్లోపు ఈ యాడ్స్ ను ప్రదర్శించుకోవచ్చు. ఈ సమయంలో.. పెద్ద వాళ్లకు మాత్రమే పరిమితమైన ప్రోగ్రామ్స్ ఎన్నో వస్తుంటాయి. అలాంటి వాటి మధ్యన కండోమ్ యాడ్స్ ను ప్రదర్శించుకోవచ్చు. ఇతర సమయాల్లో వాటికి బ్రేకే! మొత్తానికి హిందుత్వ వాద ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకొన్నట్టుగా తెలుస్తోంది.
