Monday, April 29, 2024
- Advertisement -

నితిన్‌తో ‘ఆర్ఎక్స్ 100’ ద‌ర్శ‌కుడు

- Advertisement -

ప్ర‌స్తుతం టాలీవుడ్‌ను షేక్ చేస్తున్న సినిమా ఆర్ఎక్స్ 100. చిన్న సినిమాగా వ‌చ్చి పెద్ద హిట్‌గా నిలిచింది ఈ సినిమా.కొత్త న‌టీన‌టులతో కొత్త ద‌ర్శ‌కుడు అజయ్ భూపతి ఈ సినిమా రెండున్న‌ర కోట్ల బ‌డ్జెట్‌తో తెర‌కెక్కించారు.సినిమాకు మొద‌టి రోజు నుండే యూత్ బాగా స‌పోర్టు చేశారు.సినిమా ఇప్ప‌టికే 10 కోట్ల క‌లెక్ష‌న్స్ ద‌గ్గ‌ర‌లో ఉన్న‌యని స‌మాచారం.

ఇప్పుడు ఈ సినిమా ద‌ర్శ‌కుడికి ఫుల్ డిమాండ్ ఏర్ప‌డింది.హీరో నితిన్ అజయ్ భూపతితో సినిమా చేస్తున్న‌ట్లు స‌మాచారం అందుతుంది.ఇప్ప‌టికే నితిన్ ఛలో సినిమాతో హిట్ కొట్టిన వెంకీ కుడుములను తన నెక్ట్స్ సినిమాకు దర్శకుడిగా తీసుకున్నాడు. ఇప్పుడు అజయ్ భూపతిని లైన్లో పెట్టాడు నితిన్‌. ఆర్ఎక్స్ 100 ఇండ‌స్ట్రీని త‌న‌వైపు తిప్పుకున్న అజయ్ భూపతి మ‌రి నితిన్‌కు ఎలాంటి హిట్ ఇస్తాడో చూడాలి.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -