Wednesday, May 1, 2024
- Advertisement -

నితిన్ పటేల్ తో పటాస్ బ్యాచ్

- Advertisement -

హ్యాట్రిక్ చిత్రాల దర్శకుడు అనీల్ రావిపూడి కన్ను… ఈసారి నైజాం పటేల్ పై పడింది. లవ్ స్టోరీస్ కు కరెక్ట్ సెట్ అయ్యే ఇతగాడు అనీల్ కు చిక్కాడు. నిజానికి నితిన్ తో కాకుండా మరో హీరోతో ప్రాజెక్ట్ చేయాలనుకున్నప్పటికీ… సమయాభావం వలన నితిన్ తో టై అప్ అయ్యాడు. దానికి తోడు నితిన్ తో చేస్తే… కొన్ని రకాలుగా తనకు కలిసొస్తుందనే లెక్కల్లో ఉన్నాడట.

అనీల్ ఇప్పటికే నితిన్ కు లైన్ చెప్పి ఒప్పించాడని తెలుస్తుంది. అతి త్వరలో ఈ సినిమాను అనౌన్స్ చేయబోతున్నాడు. బెంగాల్ టైగర్’ చిత్ర నిర్మాత రాధాకృష్ణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. చర్చల్లో ఉన్న ఈ సినిమాకు సంభందించి మరింత సమాచారం త్వరలోనే తెలియనుంది. అంతేగాక అనిల్ రావిపూడి గతంలో బాలకృష్ణ తో సినిమా చేస్తున్నాడని వచ్చిన వార్తలన్నీ ట్రాష్ అని తెలిసిపోయింది.

నితిన్ మాత్రం ప్రస్తుతం కృష్ణ చైతన్య దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు, ఆ సినిమా అయ్యాక ఈ మూవీ ఉంటుందని తెలుస్తుంది. ఇంతకు ముందు నితిన్ చేసిన ‘లై’ సినిమా ఆశించిన స్థాయిలో విజయాన్ని మూట గట్టుకోలేకపోయింది. నితిన్ తదుపరి సినిమాపై పూర్తి శ్రద్ధ చూపిస్తూ ఈసారి ఎలాగైనా హిట్ అందుకోవాలని ఉద్దేశ్యంలో ఉన్నాడని తెలుస్తుంది. నితిన్ పటేల్ తో అనీల్ రావిపూడి చేయబోయే సినిమా లవ్ కమ్ యాక్షన్ ఒరియెంటెడ్ గా ఉండబోతుందని తెలుస్తుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -