Saturday, May 4, 2024
- Advertisement -

పార్టీకీ రాజీనామా చేసిన సీనియ‌ర్ లీడ‌ర్‌…

- Advertisement -

ఒక వైపు సీమీపిస్తున్న సాధార‌న ఎన్నిక‌లు..మ‌రో వైపు టీడీపీలోని సీనియ‌ర్ నాయ‌కులు ఇత‌ర పార్టీల్లోకి వెల్ల‌డంతో ఆ పార్టీ నాయ‌కులుఆందోళ‌న‌లో ఉన్నారు. ఇప్ప‌టికే చాలామంది సీనియ‌ర్‌నేత‌లు వైసీపీ తీర్థం పుచ్చుకున్న సంగ‌తి తెల‌సిందే. తాజాగా కృష్ణా జిల్లాలో అధికార తెలుగు దేశం పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గిడ్డంగుల సంస్థ మాజీ చైర్మన్, కృష్ణా జిల్లాలో టీడీపీ సీనియర్ నేత బూరగడ్డ రమేష్ నాయుడు తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుకు పంపినట్టు ఆయన మీడియాకు వెల్లడించారు. దీంతో కృష్ణా జిల్లా టిడిపి లో అలజడి మొదలయ్యింది.

రమేష్ నాయుడు గతంలో రాష్ట్రస్థాయిలో నామినేటెడ్ పోస్టయిన గిడ్డంగుల సంస్థ ఛైర్మన్ గా పనిచేశారు. 1999, 2004 సంవత్సరాల్లో జరిగిన ఎన్నికల్లో మచిలీపట్నం నుంచి ఎమ్మెల్యేగా పోటీచేసి ఓడిపోయారు. టిడిపి ప్రతిపక్షంలో ఉన్న సమయంలో కూడా పార్టీనే అంటిపెట్టుకుని తన సేవలను అందించారు. ఇలా కృష్ణా జిల్లా టిడిపిలో సీనియర్ నేతగా ఎదిగారు.

తాను ఎంతగా శ్రమిస్తున్నా, పార్టీలో సరైన ప్రాధాన్యత కల్పించడం లేదని ఆరోపించిన ఆయన, గత మూడున్నర దశాబ్దాలుగా తాను వివిధ స్థాయిల్లో పని చేశానని గుర్తు చేశారు. పార్టీకి అంకితభావంతో సేవలను అందించినా, తనకు రావాల్సిన గుర్తింపు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. భవిష్యత్తులో మరో పార్టీలో చేరాలన్న విషయమై ఇంకా ఎటువంటి నిర్ణయమూ తీసుకోలేదని బూరగడ్డ వెల్లడించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -