Sunday, May 4, 2025
- Advertisement -

వైజాగ్‌లో తమ్ముడు నితిన్!

- Advertisement -

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కి హీరో నితిన్ వీరాభిమాని అన్న సంగతి తెలిసిందే. నితిన్ తన సినిమాల్లో పవన్ మేనరిజంతో కనిపిస్తారు కూడా. ఇక బహిరంగంగానే పలు వేదికలపై పవన్‌పై తనకున్న అభిమానాన్ని బయటపెట్టారు. ఇక పవన్ కెరీర్‌లో బిగ్గెస్ హిట్‌గా నిలిచిన తమ్ముడు సినిమా టైటిల్‌తో రాబోతున్నారు నితిన్.

ఈ సినిమా షూటింగ్ గతేడాదే ప్రారంభంకాగా ఈ సినిమాకు శ్రీరామ్ వేణు దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు నిర్మిస్తున్నారు. దిల్ రాజు నిర్మాణంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ లో నిర్మితమవుతున్న 56వ చిత్రమిది.

రేపటి నుండి వైజాగ్‌లో కొత్త షెడ్యూల్ ప్రారంభం కానుందని..టీమ్ అంతా సిద్ధంగా ఉందని మేకర్స్ వెల్లడించారు. పది రోజుల పాటు జరిగే ఈ షెడ్యూల్‌లో నితిన్ తో పాటు ఇతర నటులు పాల్గొననున్నారు. ఇక ఈ సినిమాలో హీరోయిన్‌,ఇతర నటుల వివరాలను త్వరలో వెల్లడించనుండగా కాంతార ఫేమ్ అజనీష్ లోక్‌నాథ్‌ సంగీతం అందిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -