Monday, April 29, 2024
- Advertisement -

నితిన్ బర్త్ డే స్పెషల్..తమ్ముడు వచ్చేశాడు

- Advertisement -

టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ బర్త్ డే నేడు. రీసెంట్‌గా ఎక్స్‌ట్రార్డినరీ మ్యాన్‌తో నిరాశ పర్చిన నితిన్…తన నెక్ట్స్ మూవీ తమ్ముడుపై భారీ ఆశలు పెట్టుకున్నారు. ప్రస్తుతం నితిన్ చేతిలో రెండు సినిమాలుండగా అందులో ఒకటి వేణు శ్రీరామ్ దర్శకత్వంలో మూవీ.

గతేడాది ఆగస్టులోనే ఈ సినిమా ప్రారంభం కాగా ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్ కోసం ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఇక ఇవాళ నితిన్ బర్త్ డే సందర్భంగా సినిమా టైటిల్‌ని రివీల్ చేశారు. గతంలో పవన్‌ హీరోగా వచ్చినా ‘తమ్ముడు’ టైటిల్‌నే ఖరారు చేశారు.

ఇందుకు సంబంధించి రిలీజ్ అయిన పోస్టర్ అందరిని ఆకట్టుకుంటోంది. ఈ పోస్టర్ లో ఆడవాళ్లు లారీ తోలుతుంటే లారీపై కుమారస్వామి ఆయుధం పట్టుకొని నితిన్ కూర్చున్నాడు. ఇక పవన్‌కు వీరాభిమాని నితిన్. తన సినిమాల్లో పవన్‌ డైలాగ్ కానీ ఆయన మేనరిజం ఉండేలా చూస్తారు. తాజాగా ఏకంగా పవన్‌ సినిమా టైటిల్‌తోనే వస్తుండగా ఈ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టడం ఖాయమని తెలుస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -