Saturday, May 4, 2024
- Advertisement -

ప‌వ‌న్‌, నితిన్ సినిమా ఫ‌స్ట్‌లుక్ విడుద‌ల‌

- Advertisement -

ఒక‌రంటే ఒక‌రు అభిమానం.. ఓ అగ్ర హీరో సినిమాకు కుర్ర హీరో నిర్మాత మార‌గా.. ఇప్పుడు ఆ కుర్ర హీరోకు ఆ అగ్ర‌హీరో నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నాడు. ఆ సినిమానే ‘ఛల్‌ మోహన్‌రంగ’. రౌడిఫెల్ ద‌ర్శ‌కుడు కృష్ణ‌చైత‌న్య ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో నితిన్ హీరోగా న‌టిస్తున్నాడు. ఈ సినిమాకు ప‌వ‌న్‌క‌ల్యాణ్ బ్యాన‌ర్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ క్రియేటివ్ వ‌ర్క్స్‌తో పాటు శ్రేష్ట్ మూవీస్‌ నిర్మిస్తున్నాయి.

పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ అంటే నితిన్‌కు అమితాభిమానం. అప్ప‌ట్లో ప‌వ‌న్ న‌టించిన సినిమాకు నితిన్ స‌హ‌కారం అందించాడు. ఇప్పుడు నితిన్ సినిమాకు పవన్‌ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. కృష్ణ చైతన్య దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో ‘ఛల్‌ మోహన్‌రంగ’ అనే టైటిల్ ఫిక్స్ చేసి సినిమా ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. ఈ లుక్‌లో నితిన్‌, మేఘా ఆకాశ్ ఆకాశంలో గంతులేస్తూ.. మ‌రో లుక్‌లో క‌ళ్ల‌జోడు పెట్టుకొని నితిన్ విజిలేస్తూ క‌నిపిస్తున్నాడు. ఈ టైటిల్ వ‌ద్ద ఎవ్రీథింగ్ ఈజ్ సైన్ అనే పుస్త‌కం రూపంలో మెసేజ్ క‌నిపిస్తోంది.

పవన్‌తో పాటు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌కూడా నిర్మాతగా వ్యవహరిస్తుండడంతో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి.ఈ సినిమా ఫస్ట్‌లుక్‌లో నితిన్‌, మేఘా ఆకాశ్‌లు గంతులేస్తుండడం ఆకట్టుకుంటోంది. ‘లై’ సినిమా తరువాత నితిన్‌, మేఘా కలిసి నటిస్తున్నారు.

ఈ సినిమాతోపాటు నితిన్‌ సతీశ్‌ వేగేశ్న దర్శకత్వంలో ‘శ్రీనివాస కల్యాణం’ సినిమా చేస్తున్నాడు. దిల్‌రాజు నిర్మాణంలో ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -