Monday, April 29, 2024
- Advertisement -

దక్షిణాఫ్రికా విజయ లక్ష్యం 290 పరుగులు…

- Advertisement -

జోహన్నెస్ బర్గ్ వేదికగా జరుగుతోన్న దక్షిణాఫ్రికా, భారత్ నాలుగో వన్డేలో టీమిండియా బ్యాట్స్ మెన్ శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ అద్భుతంగా రాణించడంతో ఏడు వికెట్ల నష్టానికి 289 పరుగులు చేసింది. టీమిండియా బ్యాట్స్‌మెన్‌లో రోహిత్ శర్మ 5, శిఖర్ ధావన్ 109, విరాట్ కోహ్లీ 75, అజింక్యా రహానె 8, శ్రేయాస్ ఐయ్యర్ 18, మహేంద్ర సింగ్ ధోనీ 42 (నాటౌట్), హార్దిక్ పాండ్యా 9, భువనేశ్వర్ కుమార్ 5, కుల్దీప్ యాదవ్ 0 (నాటౌట్) చేశారు.

ధావన్‌ సెంచరీ పూర్తి చేసుకున్న కాసేపటికి పెవిలియన్‌కు చేరడంతో భారత స్కోరులో వేగం తగ్గింది. అజింక్యా రహానే(8), శ్రేయస్‌ అయ్యర్‌(18), హార్దిక్‌ పాం‍డ్యా(9)లు స్వల్ప వ్యవధిలో పెవిలియన్‌కు చేరారు. కాగా, ధోని చివర వరకూ క్రీజ్‌లో నిలబడటంతో భారత జట్టు నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 289 పరుగులు చేసింది. దక్షిణాఫ్రికా బౌలర్లలో రబడా, ఎన్‌గిడిలు తలో రెండు వికెట్లు సాధించగా, మోర్నీ మోర్కెల్‌, క్రిస్‌ మోరిస్‌లకు చెరో వికెట్‌ లభించింది

టీమిండియాకు ఎక్స్‌ట్రాల రూపంలో 18 పరుగులు లభించాయి. దీంతో దక్షిణాఫ్రికా ముందు 290 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచగలిగింది. దక్షిణాఫ్రికా బౌలర్లలో రబాడా, ఎన్గిడిలకు రెండేసి వికెట్లు లభించగా, మార్కెల్, మోరిస్‌లకు తలో వికెట్ దక్కాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -