Saturday, April 20, 2024
- Advertisement -

అ! సినిమా పోస్ట‌ర్ విడుద‌ల చేసిన నాని

- Advertisement -

వ‌రుస సినిమాల విజ‌యంతో దూసుకెళ్తున్న నాని ఇప్పుడు నిర్మాణం రంగంలో కూడా కాలు మోపాడు. కాలు మోప‌డంతో సంచ‌ల‌నం సృష్టించాడు. అద్భుత‌మైన సినిమాలు చేస్తున్న అత‌డు నిర్మాత‌గా మారిపోవ‌డంతో అంద‌రూ సంభ్ర‌మాశ్చ‌ర్యాల‌కు గుర‌య్యారు. అయితే నాని సెల‌క్ష‌న్‌పై అంద‌రికీ న‌మ్మ‌కం ఉంది. అది ప‌క్కా హిట్ అని ముద్ర ప‌డిపోయింది. అలాంటిది నిర్మాణ రంగంలో కూడా మంచి సినిమాలు తీస్తాడ‌ని ప్రేక్ష‌కులు, అభిమానులు ధీమాగా ఉంటున్నారు.

న్యాచుర‌ల్ స్టార్‌ నాని ఇప్పుడు నిర్మాణ రంగంలోకి ప్ర‌వేశించి వాల్‌పోస్టర్ అనే బ్యాన‌ర్ రూపొందించాడు. ఆ బ్యాన‌ర్‌పై ‘అ!’ అనే సినిమా తీస్తున్నాడు. ప్రశాంత్‌ వర్మ దర్శకుడు. ప్రశాంతి త్రిపురనేని నిర్మాత. నిత్య మీనన్‌, శ్రీనివాస్‌ అవసరాల, ఈషా రెబ్బ, రెజీనా, కాజల్‌ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్‌లుక్ పోస్టర్‌ని ఇటీవల విడుదల చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమాలో కీలకపాత్రలో నటిస్తున్న నిత్యామీనన్ పోస్టర్ విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో నిత్యామీనన్ యంగ్ లుక్‌తో గ్లామర్ ఒలకబోస్తోంది. అయితే ఈ పోస్టర్‌ని యంగ్ హీరో నాని తన ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ‘‘అలా మొదలైంది నిత్యఅ! తో’’ అంటూ ట్వీట్ చేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -