Saturday, May 4, 2024
- Advertisement -

చంద్రబాబు చేతకానితనాన్ని హీరోయిజం అనుకోమంటావా రాధాకృష్ణా?

- Advertisement -

‘ఆగాలి కుస్తీ…… సాగాలి దోస్తీ…….’

‘కాంగ్రెస్ పార్టీ హడావిడిగా పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్ట్‌గా ప్రకటించింది. జాతీయ ప్రాజెక్టులు ప్రకటించిన వాటి పురోగతి ఎలా ఉంటుందో తెలియకనే ప్రజలు, రాజకీయ నాయకులు నాటి నిర్ణయంతో సంతృప్తి చెందారు’

‘భాజపా పాలిత రాష్ట్రాల్లో ఉన్న జాతీయ ప్రాజెక్టుల నిర్మాణ పురోగతి కూడా అధ్వాన్నం’

‘పోలవరం నిర్మాణాన్ని కేంద్రం చేపడితే దశాబ్ధాలు పడుతుందన్న ఉద్ధేశ్యంతో చంద్రబాబు కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి తానే నిర్మాణాన్ని చేపట్టారు’

‘రాష్ట్ర విభజన సమయంలో కూడా ఎపికి చెందిన రాజకీయ నాయకులు సంకుచితంగా వ్యవహరించడం వళ్ళే సీమాంధ్రులు నష్టపోయారు’

‘టిడిపి-బిజెపి స్నేహం కొనసాగడమనేది ప్రజాహితం దృష్ట్యా అవసరం….బిజెపితో తెగదెంపుల వళ్ళ టిడిపికి రాజకీయంగా జరిగే నష్టం ఏమీలేదు.’

‘ముఖ్యమంత్రి చంద్రబాబు తన రాజకీయ ప్రయోజనాలకు భంగం కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

‘మోదీకి చంద్రబాబుకు సత్సంబంధాలు లేవనేది బహిరంగ రహస్యం.

‘ఎపిలో నిర్మించలపెట్టిన కేంద్ర విద్యాసంస్థల నిర్మాణం అంతా కూడా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా తయారయ్యింది. రెండేళ్ళుగా అతీగతీ లేదు. విశాఖకు రైల్వే జోన్ ఇచ్చే విషయంలో ఉలుకూ పలుకూ లేదు.

‘రాజకీయంగా చూస్తే చంద్రబాబు సేఫ్ జోన్‌లేనే ఉన్నారు. పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేయడానికి ఆయన విశేషంగా కృషి చేస్తున్నారని ప్రజలు నమ్ముతున్నారు.

‘అపాయింట్‌మెంట్ ఇవ్వాలని చంద్రబాబు రాస్తున్న లేఖలకు ప్రధానమంత్రి కార్యాలయం స్పందించడం లేదు’

‘వచ్చే ఎన్నికల్లో కూడా ఎవరితోనూ పొత్తు అవసరం లేకుండానే మోడీ అధికారంలోకి వస్తారు’

‘ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా చంద్రబాబు ఏ ఒక్కరితో కూడా పొత్తులేకపోయినా మళ్ళీ అధికారంలోకి వస్తారు’

వారం వారం చంద్రబాబు భజన చేయడానికి, వైఎస్ జగన్‌ని తిట్టడానికి వీకెండ్ కామెంట్ బై ఆర్కే అంటూ వచ్చి తనకు తోచినట్టుగా రాసుకుంటూ పోయే జర్నలిస్ట్ రాసిన రాతలు ఇవి. ఈ రాతలు చూస్తుంటే ఏమర్థమవుతోంది. ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల వరకూ చూస్తే నరేంద్ర మోడీ అట్టర్ ఫెయిల్యూర్. కేంద్రం కనీస స్థాయిలో కూడా ఎపికి సాయం చేయడం లేదు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు కనీసం అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వడం లేదు మోడీ. అలాగే కేంద్ర విద్యాసంస్థల నిర్మాణం విషయంలో పురోగతి అస్సలు లేదు. శంకుస్థాపన రాళ్ళు మాత్రమే మిగిలాయి. రైల్వే జోన్ విషయంలో ఉలుకూ పలుకూ లేదు. పోలవరం నిర్మాణానికి కూడా సహకరించడం లేదు. ప్రత్యేక హోదాకు మంగళం పాడేశారు. ప్యాకేజీకి దిక్కులేదు. ఇవన్నీ రాధాకృష్ణ రాసుకొచ్చిన రాతలు. అన్నీ నిజాలే. అలాగే 2014లో రాష్ట్ర విభజన సమయంలో ఎపికి చెందిన రాజకీయ నాయకులు సంకుచిత ప్రయోజనాలు చూసుకోబట్టే సీమాంధ్రులు పూర్తిగా నష్టపోయారు అని రాసుకొచ్చారు. అది కూడా నిజమే అనుకుందాం.

కాకపోతే ఒక్కటే సందేహం. 2014లో సీమాంధ్ర నుంచి చట్టసభలలో ప్రముఖ పాత్ర పోషిస్తున్న నాయకులు ఎవరు? ఒకరు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్‌రెడ్డి, ఇంకొకరు ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబునాయుడు. మరి ఆ టైంలో సంకుచితంగా వ్యవహరించిన ఇద్దరు నాయకులు వీళ్ళేనా? నిర్ణాయలను ప్రభావితం చేసే స్థాయి ఉన్నదైతే ఈ ఇద్దరు నాయకులకే. ఎందుకంటే అప్పట్లో జగన్‌ని దెబ్బకొట్టడం కోసం ఈ ఇద్దరు నాయకులు కూడా రహస్య మిత్రత్వం నడిపారన్నది నిజం. సోనియాకు ముఖ్యమైన వ్యక్తి అయిన అహ్మద్ పటేల్‌తో సుజనాచౌదరి చర్చలు, చంద్రబాబు రహస్యంగా తనను కలిశాడని సాక్షాత్తూ పార్లమెంట్‌లోనే అప్పటి కేంద్రమంత్రివర్గంలో ముఖ్యుడైన చిదంబరం చెప్పడం లాంటివి అందరికీ తెలిసిన నిజాలే. ఇక 2014ఎన్నికలకు ముందు, ఎన్నికల సమయంలో రహస్య మిత్రత్వం నడిపినవాళ్ళు 2019కోసం బహిరంగమైపోయారు. రీసెంట్‌గా కిరణ్ కుమార్‌రెడ్డి తమ్ముడు చంద్రబాబు సమక్షంలో టిడిపిలో చేరిన విషయం తెలిసిందే. ఆసందర్భంలో కిరణ్ కుమార్‌రెడ్డి ఎంత పెద్ద వీరోచిత నాయకుడో చంద్రబాబు చెప్తూ ఉంటే రాజకీయ విశ్లేషకులు కూడా ఆశ్ఛర్యపోయారు. అదే సందర్భంలోనే జగన్‌పై కోపంతోనే సోనియా కేసులు పెట్టించింది అని కూడా చంద్రబాబు స్పష్టంగా నిజం చెప్పేశాడు. జగన్ విషయం పక్కనపెడిేతే విభజన సమయంలో సంకుచితంగా వ్యవహరించి సీమాంధ్రుల ప్రయోజనాలను తాకట్టుపెట్టింది చంద్రబాబు, కిరణ్ కుమార్‌రెడ్డిలే అని చెప్పడానికి ఇంకా వివరాలు, సాక్ష్యాలు ఏమైనా కావాలా?

ఇక 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచీ ఇప్పటి వరకూ ఉన్న పరిస్థితిని చూద్దాం. రాజధాని నిర్మాణం తనకే సాధ్యం అని చంద్రబాబు చెప్పుకున్నాడు. ఇక పవన్ కళ్యాణ్, టిడిపి భజన మీడియా, ఆరడుగుల బుల్లెట్‌గా సీమాంధ్రులకు టిడిపి భజన మీడియా పరిచయం చేసిన, సమైక్యాంధ్ర ఉద్యమాన్ని ముంచిన అశోక్ బాబు(?) తో పాటు మేధావులమని చెప్పుకునే టిడిపి ఫేక్ బ్యాచ్ అందరూ అదే చెప్పారు. ఇక కేంద్రం నుంచి ప్తత్యేక హోదా పదిహేనేళ్ళు తీసుకురావడం ……విభజనతో కుంగిపోయిన రాష్ట్రాన్ని ఎక్కడికో తీసుకెళ్ళడం బాబుకే సాధ్యమని వెంకయ్యనాయుడుతో సహా అందరూ చెప్పారు. మొత్తానికి జనాలను నమ్మించారు. కట్ చేస్తే కనీసం చంద్రబాబు ఇచ్చిన రుణమాఫీ, నిరుద్యోగ భృతి లాంటి హామీలకు కూడా దిక్కులేదు. కేంద్రం నుంచి కనీస స్థాయి ప్రయోజనాలు కూడా సాధించలేకపోయాడు. రాజధాని నిర్మాణం ఇంకా మొదలే కాలేదు. శాశ్విత నిర్మాణాలు ఒక్కటి కూడా కనీసం శంకుస్థాపనల స్థాయి కూడా దాటలేదు. ఇక రైల్వేజోన్ లాంటి వాటి గురించి మాట్లాడుకోవడం వేస్ట్. హోదా హోగయా…….ప్యాకేజీ ఆల్సో గయా అని ఈ మధ్యనే చంద్రబాబే ఆక్రోశించాడు.

అయినప్పటికీ రాజకీయ పార్టీలు ఏవీ బ్లేమ్ గేం ఆడకూడదని రాధాకృష్ణ చెప్తున్నాడు. అంటే ఇండైరెక్ట్‌గా బాబుని విమర్శించకూడదు అని చెప్తున్నాడు. ఇక జనసేనతో సహా అన్ని రాజకీయ పార్టీలు బాబు భజనలో తరించిపోతున్న నేపథ్యంలో బాబుని విమర్శించేది ఒక్క జగనే కాబట్టి చంద్రబాబుని విమర్శించొద్దు అని జగన్‌కి చెప్తున్నాడన్నమాట. అలాగే 2019లో కూడా బాబే గెలుస్తాడు……..సీమాంధ్రులకు వేరే దిక్కులేదు అని కూడా చెప్తున్నాడు. అదేమంటే బాబు ఏమీ చేయకపోయినా……కేంద్రం నుంచి ఏమీ తెచ్చుకోవడం చేతకాకపోయినా సరే బాబుకే ఓటెయ్యాలి. ఎందుకంటే బాబుని మించిన పోటుగాడు ఇంకెవ్వరూ లేరు. బాబే విఫలమయ్యాడంటే ఇంకెవరూ ఏమీ చెయ్యలేరు అన్నది బాబుతో సహా టిడిపి భజన బ్యాచ్ సిద్ధాంతం.

ఇలాంటి ఏషాల వళ్ళే సీమాంధ్రుల ఆగ్రహావేశాలతో రగిలిపోతున్న పరిస్థితి. 2014 విభజన సమయంలో ఏమీ చేయలేని బాబు……కేవలం రాజకీయ సంకుచితంతో వ్యవహరించిన బాబు…….2014 నుంచీ ఇప్పటి వరకూ ఏమీ చేయలేని బాబు……2019లో మరోసారి గెలిపిస్తే మాత్రం ఏం చేస్తాడట? ఇక బిజెపితో విడిపోతే బాబుకు రాజకీయంగా నష్టం ఏమీ ఉండదట. అయినా రాజకీయ నష్టం ఉంటుందని ఎవరు చెప్పారు? ఓటుకు నోటు కేసుతో సహా స్టేలతో ఉన్న కేసులు, భూ సేకరణ అక్రమాలతో సహా ఈ మూడున్నరేళ్ళుగా తెగబడి పాల్పడిన అధికార పార్టీ దందాలన్నీ మెడకు చుట్టుకుంటాయన్న భయం అని కదా అందరూ చెప్తున్నది. అంతేకాకుండా మోడీకి కోపం వచ్చేలా చంద్రబాబు చే్స్తే జగన్‌పై కోపంతో సోనియా పెట్టించిన కేసులని చంద్రబాబు ఏవైతే కేసుల గురించి చెప్పాడో……..అవే కేసులను మోడీ ఎక్కడ ఎత్తేయిస్తాడో అన్న భయం అని కదా రాజకీయ విశ్లేషకులు చెప్తోంది. అందుకే మోడీ ఛీకొట్టినా, కనీసం అపాయింట్‌మెంట్‌కి దిక్కులేకపోయినా, సీమాంధ్రప్రజలను పూర్తిగా పుట్టి ముంచుతూ హోదా, రైల్వేజోన్, రాజధాని నిధులు, లోటు బడ్జెట్‌తో సహా అన్నింటి విషయంలోనూ పూర్తిగా పట్టించుకోకపోయినా పల్లేత్తు మాట అనే ధైర్యం లేక ఇందిరా గాంధీ టైంలో కాంగ్రెస్ ముఖ్యమంత్రులకంటే కూడా టాప్ రేంజ్ బానిసత్వాన్ని చూపిస్తూ మోడీకి సలాం కొడుతున్నది.

మరి ఇలాంటి బాబుగారికి 2019లో కూడా మరోసారి అధికారం అప్పగిస్తారట సీమాంధ్ర ప్రజలు. అని టిడిపి భజన మీడియా, బాబు అండ్ కో చెప్తున్నారు. ఇక రేపో మాపో పవన్ కళ్యాణ్, లోక్ సత్తా జెపితో పాటు బాబు వందిమాగధులైన మేధావులందరూ కూడా బాబు తప్ప వేరే దిక్కులేదని చెప్తారనడంలో సందేహం లేదు. మరి సీమాంధ్రులు 2019లో కూడా బాబుకే ఓటేస్తారా? అదే జరిగితే మాత్రం చంద్రబాబు ప్రపంచ రికార్డ్ సృష్టించిన నేతగా మిగిలిపోతాడు. ఎందుకంటే తాను ఇచ్చిన హామీలు, మోడీది-నాదీ అభివృద్ధి జోడీ….పదిహేనేళ్ళు ప్రత్యేక హోదా, రైల్వే జోన్, పోలవరం అంటూ మోడీకి కూడా వత్తాసు పలుకుతూ చెప్పిన ప్రగల్భాలు ఏవీ నెరవేరకపోయినా ……..ఏమీ చెయకపోయినా మళ్ళీ అధికారంలోకి వచ్చాడంటే అంతకుమించిన రికార్డ్ ఇంకేం ఉంటుంది? కాకపోతే సీమాంధ్ర ప్రజలను చూసి 2014 రాష్ట్ర విభజన సమయం నుంచీ కూడా దేశవ్యాప్తంగా ఉన్న నాయకులు, రాజకీయాలపై అవగాహన ఉన్న ప్రజలు జాలిపడుతున్నారు. 2019 తర్వాత కూడా ఇదే పరిస్థితి ఉంటే ఇంకెంత జాలి చూపించాలో వాళ్ళకు కూడా అర్థం కాదేమో.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -