సైరాలో చిరు లుక్ చూస్తారా… స‌న్న‌బ‌డుతున్న మెగాస్టార్‌

- Advertisement -

ఖైదీ నెం 150 సినిమా త‌ర్వాత మెగాస్టార్ చిరంజీవి తీస్తున్న సినిమా సైరా. చారిత్ర‌క నేప‌థ్యంతో కూడిన కథాంశంతో ఈ సినిమా రానుంది. ఈ సినిమాను జాతీయ స్థాయి చిత్రంగా తీర్చిదిద్దేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నారు. బాహుబ‌లి స్థాయిలో తీసేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. భార‌తీయ సినీ ప‌రిశ్ర‌మలో ఉన్న ప్రముఖ న‌టీన‌టుల‌ను ఎంపిక చేసేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. అందులో భాగంగా అమితాబ్ బ‌చ్చ‌న్‌ను ముఖ్య పాత్ర‌ధారిగా ఎంపిక చేశార‌ని టాక్‌. అయితే అది ఇంకా ఖ‌రారు కాలేదు. పుకార్ల‌యితే వ‌స్తున్నాయి. ఇక ఏ ఆర్ ర‌హ‌మాన్‌ను సంగీత ద‌ర్శ‌కుడిగా అడిగినా అత‌డు డేట్లు ఖాళీగా లేక‌పోవ‌డంతో అంగీక‌రించ‌లేదు. ఈ విధంగా ప్ర‌ముఖుల‌ను ఎంపిక చేసేందుకు ఇప్ప‌టికీ చిత్ర‌బృందం ప‌నిచేస్తోంది.

అయితే ఈ సినిమా కోసం చిరంజీవి తీవ్రంగా క‌ష్ట‌ప‌డుతున్నాడు. ఉయ్య‌ల‌వాడ న‌ర్సింహారెడ్డిగా క‌నిపించేందుకు స‌న్న‌బ‌డుతున్నాడు. ఐదు ప‌దుల వ‌య‌సులో ఆయ‌న సినిమా కోసం తెగ‌క‌ష్ట‌ప‌డుతున్నాడు. సినిమా అంటే అత‌డికి మొద‌టి నుంచి ఇష్టం.. ప్రాణం. అందుకోసం స‌న్న‌బ‌డి ప్రేక్ష‌కుల‌ను అబ్బుర‌ప‌రిచేలా చేయాల‌ని చిరు ప్ర‌య‌త్నం చేస్తున్నాడు. టీష‌ర్ట్ వేసుకొని చ‌ర‌ణ్ మాదిరి క‌న‌బ‌డేలా త‌యార‌వుతోన్నారు.

- Advertisement -

త‌న‌యుడు రామ్‌చ‌ర‌ణ్‌తేజ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. సురేంద‌ర్‌రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో సినిమా రానుంది. న‌య‌న‌తార, విజ‌య్ సేతుప‌తి, కిచ్చా సుదీప్ త‌దిత‌రులు ముఖ్య పాత్ర‌లు పోషిస్తున్నారు. తెలుగు, హిందీ, త‌మిళ్‌, మ‌ల‌యాళం, క‌న్న‌డ భాష‌ల్లో విడుద‌ల చేయాల‌ని ప్లాన్‌..

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -