Saturday, May 18, 2024
- Advertisement -

‘అ..ఆ’ మూవీ ట్రైలర్!

- Advertisement -

నితిన్, సమంత హీరో హీరోయిన్లుగా ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘అ..ఆ’. అనసూయ రామలింగం వర్సెస్ ఆనంద్ వివహారి అనే సబ్ టైటిల్ తో ఈ చిత్రం తెరకెక్కుతుంది. ఈ చిత్రం ఆడియో వేడుక రోటీన్ గా, సాదా సీదాగా కాకుండా డిఫరెంటుగా ఈ రోజు జరిగింది. ఇప్పటి వరకు సినిమాపై జనాల్లో పెద్దగా హైప్ లేదు. ఆడియో వేడుకతో సినిమాపై అంచనాలు పెంచేలా చేశాడు త్రివిక్రమ్.

ముఖ్యంగా ఫ్యామిలీ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఈ చిత్రాన్నికి తెరకెక్కించినట్లు తెలుస్తుంది. ఈ చిత్రం ఓ పల్లెటూరి ఫ్యామిలీకి, ఓ సిటీ ఫ్యామిలీకి మధ్య ఏర్పడ్డ అంతరాలు అనే పాయింట్‌తో సాగుతుందట. ఈ ఆడియో వేడుకలో పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా పాల్గొన్ని అభిమానులను సంతోష పెట్టారు. ఈ రోజు రిలీజ్ చేసిన ట్రైలర్ చాలా అద్భుతంగా ఉంది. ఈ సినిమా నితిన్ కేరియర్ లోనే మంచి సినిమాగా పేరు తెచ్చుకునేలా ఉంది. త్రివిక్రామ్ తన మార్క కనబడేలా ఈ సినిమా తెరకేక్కించాడు.

హీరోయిన్స్ కూడా అందగా కనిపిస్తున్నారు. త్రివిక్రమ్ దర్శకత్వం లో నితిన్ తొలిసారిగా నటిస్తున్న ఈ చిత్రంలో ఆయన సరసన సమంతనాయికగా తొలిసారిగా నటిస్తున్నారు. మరో కధానాయిక గా ‘ అనుపమ పరమేశ్వరన్'(మలయాళ చిత్రం ‘ప్రేమమ్’ ఫేం) నటిస్తున్నారు. చిత్రంలోని ఇతర ప్రధాన పాత్రలలో .. నదియ,అనన్య,ఈస్వరీరావు,సన, గిరిబాబు, నరేష్,రావురమేష్ ,పోసాని, అవసరాల శ్రీనివాస్, రఘుబాబు, ప్రవీణ్, శ్రీనివాస రెడ్డి లు నటిస్తున్నారు. 

క్రింద ఉన్న  ‘అ..ఆ’ ట్రైలర్ ను మీరూ చూడండి..

{youtube}V4KdbX1xvaI{/youtube}

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -