Sunday, May 19, 2024
- Advertisement -

పవన్ రికార్డ్ ను బ్రేక్ చేయలేకపోయిన మహేష్!

- Advertisement -

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటీవలే సర్దార్ గబ్బర్ సింగ్ చిత్రాన్ని ఈ సమ్మర్ కి రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రంతో అన్ని ఏరియాల్లో కలిపి రికార్డు స్థాయిలో ప్రీ రిలీజ్ బిజినెస్ చేసి చరిత్ర సృష్టించాడు. కానీ సినిమా కథలో దమ్ము లేకపోవడంతో బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా కొంత నిరశపరిచింది. అయితే పవన్ సర్దార్ చిత్రాన్ని ఇంద్ర ఫిలిమ్స్ వారు నైజాం ఏరియా హక్కులను 20 కోట్ల భారీ రేటు చెల్లించి దక్కించుకున్నారు.

ఇది చాలా పెద్ద రికార్డ్ అవ్వడంతో ఈ రికార్డ్ ను మహేష్ బాబు తన బ్రహ్మోత్సవం సినిమాతో  బ్రేక్ చేస్తాడని అందరు అనుకున్నారు. కాని పవన్ సృష్టించిన రికార్డ్ మహేష్ అందుకోలేక పోయాడు. అయితే తాజాగా బ్రహ్మోత్సవం నైజాం రైట్స్ ని అభిషేక్ పిక్చర్స్ వారు 16.20 కోట్ల రేటు చెల్లించి దక్కించుకున్నారు. గతంలో మహేష్ శ్రీమంతుడు చిత్రాన్ని 14.4 కోట్లకు దక్కించుకున్న అభిషేక్ పిక్చర్స్ వారు శ్రీమంతుడు చిత్రంతో  22 కోట్ల వసూళ్ళని రాబట్టుకున్నారు.  

కాని నైజాం ఏరియాలో 23 కోట్ల అత్యధిక రేటుకు అమ్ముడై మొదటి స్థానంలో ఉంది. ఇక ప్రస్తుతం పవన్ ఎస్ జే సూర్య దర్శకత్వంలో ఓ సినిమా చేస్తుండగా, మహేష్ ప్రస్తుతం బ్రహ్మోత్సవం చిత్రాన్ని రిలీజ్ చేసే పనిలో ఉన్నాడు ఈ చిత్రం రిలీజ్ అయ్యాక ఏ ఆర్ మురగదాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు. భారీ వ్యయంతో ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -