Friday, May 10, 2024
- Advertisement -

క‌ళ్యాణం, క‌మ‌నీయం శ్రీనివాస కళ్యాణం’ ట్రైలర్‌…

- Advertisement -

అ ఆ’ సినిమాతో భారీ హిట్‌ కొట్టాడు నితిన్‌. తరువాత ‘లై’, ‘ఛల్‌ మోహన్‌రంగా’ సినిమాలు చేసినా.. ఆ స్థాయిలో విజయవంతం కాలేదు. అయితే నితిన్‌ కేరిర్‌కు ఊపునిచ్చిన సినిమా ‘దిల్‌’. ఈ సినిమాను నిర్మించిన రాజు ‘దిల్‌’ రాజుగా ఇండస్ట్రీలో ఓ గుర్తింపును తెచ్చుకున్నారు. మళ్లీ ఇన్నేళ్ల తరవాత నితిన్‌ హీరోగా, దిల్‌ రాజు నిర్మాణ సారథ్యంలో తెరకెక్కుతున్న సినిమా శ్రీనివాస కళ్యాణం.

ఈ మూవీలో మిక్కి జే మేయర్‌ అందించిన పాటలు ఇప్పటికే పాపులర్‌ అయ్యాయి. భారీ తారాగణంతో వస్తోన్న ఈ మూవీపై అందరి దృష్టి నెలకొంది. సతీష్ వేగేశ్న ఈ కళ్యాణానికి దర్శకత్వం వహించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ మండపంపై దిల్ రాజు, శిరీష్ ఈ కళ్యాణాన్ని జరిపించారుతాజాగా ఈ చిత్రం ట్రైలర్‌ను సూపర్‌స్టార్‌ మహేష్‌ బాబు రిలీజ్‌ చేశారు.

ట్రైలర్ చాలా ఆహ్లాదకరంగా ఉంది. ‘నానమ్మ పెళ్లంటే ఏంటి?’ అని చిన్న పిల్లాడు అడిగితే.. ‘పెళ్లంటే పెద్ద పండగ’ అని జయసుధ చెప్పిన డైలాగుతో ట్రైలర్ మొదలైంది. ఆ పిల్లాడే పెద్దవాడై ‘చిన్నప్పుడు నానమ్మ చెప్పింది పెళ్లంటే పండగ అని. అలాంటి పెళ్లి ఎన్ని జ్ఞాపకాలను ఇవ్వాలి’ అని చెప్పే డైలాగుతో ట్రైలర్ పూర్తయింది. ఆ పిల్లాడే హీరో నితిన్. ఈ మూవీ ఆగస్టు 9న విడుదల కానుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -