Saturday, May 11, 2024
- Advertisement -

మాస్ మ‌హారాజ్‌తో నివేథా థామస్‌

- Advertisement -

మాస్ మ‌హారాజ్ రవితేజ మంచి ఫామ్‌లో ఉన్నాడు. రాజా ది గ్రేట్ సినిమాతో హిట్ కొట్టిన ర‌వితేజ వ‌రుస సినిమాల‌ను లైన్లో పెట్టాడు.ప్ర‌స్తుతం ర‌వితేజ ట‌చ్ చేస చూడు సినిమా రిలీజ్‌కు రెడీ చేశాడు.ఫిబ్ర‌వ‌రి 2న సినిమా విడుద‌ల‌కు సిద్థంగా ఉంది. ఈ సినిమా పై మంచి బ‌జ్ ఉంది. ఈ సినిమా త‌రువాత ర‌వితేజ ‘నేల టికెట్‌’ అనే సినిమాను కళ్యాణ్‌ కృష్ణ దర్శకత్వంలో న‌టిస్తున్నాడు. నేల టికెట్‌ తరువాత స్టార్ డైరెక్టర్‌ శ్రీనువైట్ల దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు.

ఈ సినిమాలో ర‌వితేజ ప‌క్క‌న టాలీవుడ్ మోస్ట్ టాలెంట్‌డ్ హీరోయిన్‌గా పేరు సంపాదించిన నివేథా థామస్‌ను హీరోయిన్‌గా తీసుకున్నార‌ని సమాచ‌రం.జెంటిల్‌మన్‌, నిన్నుకోరి సినిమాలతో టాలెంటెడ్‌ హీరోయిన్‌ గా పేరు తెచ్చుకున్న నివేథ.. సినిమాల ఎంపికలో సెలెక్టివ్‌గా ఉంటోంది. వరుసగా హిట్ సినిమాల్లో నటించిన ఈ భామ ప్రస్తుతం తెలుగులో ఒక్క సినిమా కూడా చేయటం లేదు. తన క్యారెక్టర్‌ నచ్చటంతో నటించేందుకు అంగీకరించిందట నివేథ. ఈ సినిమాలో రవితేజ మూడు విభిన్న పాత్రల్లో కనిపించనున్నారన్న ప్రచారం జరుగుతోంది.

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -