Thursday, April 25, 2024
- Advertisement -

స్పెయిన్ లో రవితేజ ధమాకా

- Advertisement -

మాస్ మహారాజా రవితేజ , డైరెక్టర్ త్రినాధరావు నక్కిన ఔట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్ “ధమాకా” షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. ఈ చిత్రాన్ని నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్ భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. నటి శ్రీలీల కథానాయికగా నటిస్తోంది. ఇటీవల హైదరాబాద్లో హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ ని చిత్రీకరించారు.

ఈ యాక్షన్ ఎపిసోడ్ కు రామ్-లక్ష్మణ్ మాస్టర్స్ కొరియోగ్రఫీ చేశారు. పాటల చిత్రీకరణ కోసం టీమ్ స్పెయిన్ వెళ్లింది. ప్రస్తుతం రవితేజ, శ్రీలీలపై ఓ పాటను ప్లాజా డి ఎస్పానా అనే హిస్టారికల్ లొకేషన్లో షూట్ చేశారు. ‘డబుల్ ఇంపాక్ట్’ అనే ఆసక్తికరమైన ట్యాగ్లైన్ తో ధమాకా వస్తోంది.

ఈ చిత్రానికి ప్రసన్న కుమార్ బెజవాడ కథ, స్క్రీన్ ప్లే, సంభాషణలు అందించగా, భీమ్స్ సిసిరోలియో సంగీతం సమకూరుస్తున్నారు. కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. వివేక్ కూచిబొట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి శ్రీనాగేంద్ర తంగల ప్రొడక్షన్ డిజైనర్.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -