‘నెం.1 యారి విత్ రానా’ అనే షోకి రానా హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. ఈ షోకి వచ్చిన అతిథుల నుంచి రానా తెలుసుకుంటున్న జవాబులు.. ఈ షోని రానా నడిపిస్తున్న తీరు అందరిని ఆకట్టుకుంటుంది. ఇటివలే జరిగిన ఈ షోకి బాలకృష్ణ, పూరి జగన్నాథ్ వచ్చారు.
ఈ సందర్భంగా బాలయ్య, పూరి ఎన్నో విషయాలు చెప్పుకొచ్చారు. బాలయ్య ఈ షోలో చాలా ఎనర్జిటిగా అల్లరి చేశారు. బాలయ్యతో రానా మాట్లాడుతూ.. మీ సినిమాలు చూస్తూ పెరిగాను.. ఇప్పుడు మీతో ఈ షో చేస్తుండటం ఆనందంగా ఉందని అన్నారు. అయితే ఈ షోకి ముందు బాలయ్య రాగా.. కొద్దిసేపటికి దర్శకుడు పూరి జగన్నాథ్ ఎంతరయ్యారు. పూరి వస్తున్నారని అనౌన్స్ చేయగానే… బాలయ్య విజిల్స్ వేయడం గమనార్హం. సాధారణంగా స్టార్ హీరోలు ఏదైనా టీవీ షోకు వస్తున్నారంటే…. కాస్త ఫోజులు కొడతారు. అక్కడ కావాలని తమ యాటిట్యూడ్ ప్రదర్శించే ప్రయత్నం చేస్తుంటారు. అయితే బాలయ్య అలాంటివేమీ చేయకుండా తాను రియల్ గా ఎలా ఉంటాడో అలాగే ప్రవర్తించాడు. సెట్లోకి రావడంతోనే పైసా వసూల్ సాంగుకు డాన్స్ చేశారు.
అయితే బాలయ్య తనను రెండు సార్లు కొట్టాడని రానా వివరించారు. తాను ఒకసారి బాలకృష్ణ గారిని సార్ అని పిలిస్తే ఎవడ్రా నీకు సార్ అంటూ ఒక్క దెబ్బ కొట్టాడని, ఇంకో సందర్భంలో అంకుల్ అనిపిలిస్తే కొట్టాడని రానా చెప్పారు. ఇక పూరితో సినిమా వద్దని బాలయ్యకు చాలా మంది చెప్పారంట. కానీ అవేం పట్టించుకోలేదని బాలయ్య తెలిపారు. ఇక బాలయ్య తాను ఇంకా కుర్రాన్నే అంటూ రానా షోలో రచ్చ రచ్చ చేశారు.
