Tuesday, April 30, 2024
- Advertisement -

సిల్క్ స్మితను ఆ హీరో బాగా ఇబ్బంది పెట్టాడట

- Advertisement -

సిల్క్ స్మిత ఈమెకి అప్పట్లో స్టార్ హీరోకి ఉన్న రేంజ్ ఉండేది. 1980 దశాబ్దంలో కుర్రాడి నుంచి అర‌వైఏళ్ల ముస‌లాళ్ల దాక.. ఈ భామ సినిమాలు వస్తున్నాయంటే.. ఎగబడి వెళ్ళేవారు. త‌న ఒక్క పాట‌తో సినిమాను మొత్తం సూప‌ర్‌ హిట్ చేసిన ట్రాక్ రికార్డ్ సిల్క్ స్మిత‌కు ఉంది. ఇప్ప‌టివ‌ర‌కు ఏ ఐట‌మ్ గ‌ల్‌కు అలాంటి ట్రాక్ రికార్డు లేదు.

విడుదలకి నోచుకోని ఎన్నో సినిమాలు సిల్క్ స్మితతో ఐటమ్ సాంగ్ చేయించి.. విడుదల చేసి అధిక మొత్తాల‌ను కొల్లగొట్టిన నిర్మాత‌లు ఆ రోజుల్లో చాలామందే ఉన్నారు. అప్పట్లో సిల్క్ పాట‌లేని సినిమాలు ఊహించ‌లేము. అయితే సిల్క్ స్మితా చివ‌రి రోజుల్లో మాత్రం ఆమెను అదుకున్న స్టార్ ఒక్క‌రూ లేరు. ఎవ‌రైనా ఒక కోటి రూపాయ‌లు ఇస్తే త‌న జీవితాన్ని బాగు చేసుకుంటాన‌ని అప్ప‌ట్లో సినిమా ఇంట‌ర్యూల‌లో స్మిత్ కామెంట్ చేసింది. ఆమెను ఉప‌యోగించుకున్న వాళ్లు ఎవ‌రూ ఆమె క‌ష్టాల్లో ఉన్నప్పుడు సహాయపడలేదు. సెప్టెంబ‌ర్ 23 1996 మ‌ద్రాల‌సులో సిల్క్ స్మిత త‌న బెడ్ రూమ్‌లో ఫ్యాన్ కి ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకుంది. మ‌రి అలాంటి సిల్క్ స్మితా జీవితం ఎందుకు అర్ధాంత‌రంగా ముగింసింది.

మ‌రి ఆమె మ‌ర‌ణానికి సినీ స్టార్లే కార‌ణ‌మా..! లేక బ్లూ ఫిలిమ్ మాఫియానే ఆమె ప్రాణం తీశాయా.. అనేదే అంద‌రిలో ఉన్న అనుమాణం. ఆమె పోస్టుమార్టం రిపోర్టులో ఆమే క‌డుపులో విష అవశేషాలు ఏమిలేవ‌ని తేల్చింది. అయినా సిల్క్ స్మితా మ‌ర‌ణం ఎన్నో అనుమానాల‌కు కార‌ణ‌మైంది. సిల్క్ స్మితానీ ఎవ‌రైనా చంపేశారా లేక చ‌నిపోయో ప‌రిస్థితి క‌ల్పించారా అన్నది వీడని మిస్టరీ. అయితే ప్రేమ అనే పేరుతో సిల్క్ ని ఓ టాప్ హీరో చిత్రహింస లకు గురి చేసినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. అంతేకాకుండా.. తన ప్రేమకు గుర్తుగా సిగరెట్లతో కాల్చాడట.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -