Monday, May 20, 2024
- Advertisement -

త్రీడీ లో రాని రుద్రమదేవి?

- Advertisement -

దాదాపు సంవత్సర కాలం నుంచీ అదిగో ఇదిగో అంటూ ఊరిస్తోంది రుద్రమ దేవి సినిమా. 

ఈ సినిమా విడుదల సంగతి ఎంతటికీ తేల్చడం లేదు నిర్మాతలు. మొత్తానికి  గుణ శేకర్ స్వయంగా అక్టోబర్ 9 అంటూ విడుదల తేదీ ఖరారు చేసారు. ఇంకా తొమ్మిది రోజులు రిలీజ్ డేట్ దూరంగా ఉండడం తో విడుదల విషయం లో ఇంకా నమ్మకాలు లేవు అంటున్నారు డిస్ట్రిబ్యూటర్ లు. 

ఈ సినిమా కోసం 9 సంవత్సరాలు గుణ శేకర్ రీసర్చ్ చేసి మూడేళ్ళ పాటు సినిమా ని కష్టపడి తీసారు. అయితే మనవద్ద ఉన్న సమాచారం ప్రకారం ఈ సినిమా త్రీడీ విడుదల ఉండదు అంటున్నారు. ఇంకా ఈ సినిమా కి 3డి వర్క్ ఫినిష్ కాకపోవడం కారణం గా చెబుతున్నారు. మాకు అందిన విశ్వసనీయ సమాచారం ప్రకారం.. రుద్రమదేవికి సంబందించిన అన్ని అడ్డులు తొలగిపోయాయి. కచ్చితంగా అక్టోబర్ 9న సినిమా రిలీజ్ అవుతుంది. 

కానీ తెలుగు, తమిళంలో 2డి రిలీజ్ ఉంటుంది. త్రీడీ ఒకవేళ ఉన్న ఎక్కువ భాగం ఉండకపోవచ్చు.  ఇన్నాళ్ళూ త్రీడీ కోసమే ఆగి ఇప్పటికీ దాన్ని సాధించలేక అలాగే విడుదల చెయ్యడం ఏంటో విడ్డూరం. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -