Friday, May 17, 2024
- Advertisement -

” అతని నుంచి తప్పించుకున్నా, లేదంటే .. బాబోయ్ “- హీరోయిన్

- Advertisement -

బాలీవుడ్ సినిమాలలో లిప్ లాక్ సీన్లకి పెట్టింది పేరు ఇమ్రాన్ హష్మీ. అతను నిమిషాల కొద్దీ ఆధారాలు ముద్దు పెట్టుకుని ఒదలకుండా చంపేస్తూ ఉంటాడు హీరోయిన్ లని. మర్డర్ అనే సినిమా తో మొదలైన అతని ప్రస్తానం అప్పట్లో పెను సంచలనం రేపింది. మల్లికా సారవత్ , ఇమ్రాన్ అప్పట్లో తమ ముద్దులతోనే ఆ సినిమాని సూపర్ హిట్ చేసి పారేశారు.

ఆ తరవాత తన సినిమాల నిండా స్టొరీ కంటే ఎక్కువగా ముద్దులకే ప్రాధాన్యత ఇచ్చి లిప్ కిస్ స్టార్ గా అవతారం ఎత్తాడు ఇమ్రాన్. ఇప్పుడు ఒక సీనియర్ హీరోయిన్ ఇమ్రాన్ హష్మీ ముద్దుల నుంచి తప్పించుకుందట. ఆ విషయం ఆమె చెబుతోంది. బాలీవుడ్ హాటెస్ట్ బికినీ బ్యూటీలలో ఒకరిగా పేరు పొందిన మాజీ మిస్ వరల్డ్ లారాదత్తా ప్రస్తుతం ఇమ్రాన్ హష్మీ హీరోగా చేస్తున్న అజార్ సినిమాలో లాయర్ గా చేస్తుంది.

కాగా ఈ సినిమాలో హీరోయిన్స్ గా చేస్తున్న ప్రాచీదేశాయ్ మరియు నర్గీస్ ఫక్రీలకు హాట్ లిప్ లాక్స్ ఇచ్చిన ఇమ్రాన్ ఇందులో లాయర్ రోల్ చేస్తున్న లారాదత్తాతో మాత్రం ముద్దు సీన్ లేనందుకు ఫీల్ అయ్యాడట. లారాదత్తా మాత్రం ఇమ్రాన్ తో సినిమాచేసి లిప్ లాక్ చేయకుండా బయటపడ్డ తొలి హీరోయిన్ నేనే అని గర్వంగా ఫీల్ అవుతుంది.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -