Thursday, May 16, 2024
- Advertisement -

మెగా హీరోయిన్ నిహారిక కి ఫ్లాట్ అయిన డైరెక్టర్ పూరీ

- Advertisement -

కొడుకులని  మాత్రమే వారసులు గా ప్రకటించే సినిమా ఇండస్ట్రీ లో హీరోయిన్ గా తన కూతురుని పంపించారు మెగా హీరో నాగ బాబు. ఇంటర్నెట్ లో టీవీ లో యమా ఫేమస్ అయిపోయిన తరవాత హీరోయిన్ గా కొత్త అవతారం ఎత్తేసిన హీరోయిన్ నిహారిక ఇప్పుడు ఒక మనసు తో సందడి చెయ్యబోతున్న సంగతి తెలిసిందే.

అంతేకాదు తాజాగా ఈ మెగా డాటర్ గొంతు సవరించుకోబోతున్నట్టు సమాచారం. అందుకు డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ప్రయత్నం చేస్తున్నాడట. స్వీట్ గా క్యూట్ గా మాట్లాడే నిహారిక వాయిస్ ఇప్పటికే ఆడియెన్స్ ఆకట్టుకుంటోంది. దాంతో నిహారికలోని ఈ టాలెంట్ ను వాడుకోవాలని డైరెక్టర్ పూరీ ఎప్పటినుంచో ప్రయత్నిస్తున్నాడట. 

గతంలోనే ‘లోఫర్’ సినిమాలో హీరోయిన్ దిశా పటానీకి నిహారికతోనే డబ్బింగ్ చెప్పించాలని అనుకున్నాడట పూరి. కానీ అది వర్కౌట్ అవ్వలేదు. అయితే తాజాగా కళ్యాణ్ రామ్ ‘రీమిక్స్’ చిత్రంలోనైనా అమ్మడి వాయిస్ ను వాడుకోవాలని గట్టిగానే ట్రై చేస్తున్నాడట పూరీ. ఈ సినిమాలో హీరోయిన్ సురభికి నిహారికతో డబ్బింగ్ చెప్పించాలని భావిస్తున్నాడట. మరి నిహారిక తన వాయిస్ తో ఎలా మెప్పిస్తుందో చూడాలి.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -