ఈ మధ్య దేశంలో వింత వింత కేసులు వస్తున్నాయి. బిగ్ బి అమితాబ్ బచ్చన్ జాతీయ గీతం సరిగా పాడలేదని ఓ భారతీయుడు కేసేసేరు. ఆయనే మళ్లీ తాజాగా క్రికెటర్ల హెల్మెట్ పై కూడా మరో కేసు పెట్టారు. ఈసారి కేసుల వంతు సూపర్ స్టార్ రజనీకాంత్ వంతైంది.
సాధారణంగా రజనీకాంత్ సినిమా విడుదలవుతోందంటే ఆయన అభిమానులు చేసే హడావుడి అంతా ఇంతా కాదు. రజనీ కటౌట్లకు పూలదండలు వేయడం, డప్పుల మోతతో ఆ కటౌట్లను ఊరేగించడం చేస్తారు. ఒక్కోచోట అయితే ఏకంగా కటౌట్లకు పాలభిషేకం కూడా చేస్తారు. ఇదిగో ఇక్కడే చిన్న తిరకాసు వచ్చింది. రజనీకాంత్ కటౌట్ కు పాలభిషేకం చేయరాదని, అభిమానులకు ఈ విధంగా రజనీ విజ్ఞప్తి చేయాలంటూ బెంగళూరులో ఒకరు కోర్టును ఆశ్రయించారు.
అంతే కాదు సూపర్ స్టార్ చేత కోర్టు ఈ మేరకు ప్రకటన చేయించాలని ఆ పిటీషినర్ కోరారు. ఇదంతా ఎందుకనుకుంటున్నారా. ఏం లేదు.. ఇలా క్షీరాభిషేకం చేయడం వల్ల ఎన్నో లీటర్ల పాలు వృద్ధా అవుతున్నాయని ఆ పిటీషినర్ బాధ. మరి ఈయన పిటీషన్ కు కోర్టు స్పందిస్తుందో.. లేదో.. చూడాలి. ఒకవేళ కోర్టు స్పందించినా రజనీకాంత్ అభిమానులకు పిలుపినిస్తాడో లేదో చూడాలి. ఏమిటో దేశంలో ప్రతిదానికి కోర్టును లాగుతున్నారు.