Tuesday, May 14, 2024
- Advertisement -

ఇక మీద అలాంటి సీన్ల‌లో న‌టించ‌ను

- Advertisement -

ఉన్న‌ది ఉన్న‌ట్లు చెప్పేవారు చాలా త‌క్కువ మంది ఉంటారు.వారిలో ముందువ‌ర‌స‌లో ఉంటారు నటి అండ్రియా.కెరీర్ స్టార్టింగ్ నుంచి ఒక‌రి త‌న ప్ర‌వ‌ర్త‌న‌ను మార్చ‌కోలేదు అండ్రియా.తనకు నచ్చిన పనిచేయడానికి ఏమాత్రం వెనుకాడని నటి ఈమె. ఆ మధ్య యువ సంగీత దర్శకుడు అనిరుధ్‌తో రోమాన్స్‌ చేస్తున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయినా, డోంట్‌కేర్, వ్యక్తిగత విషయాల గురించి ఇతరులకు బదులివ్వాల్సిన అవసరం లేదని బహిరంగంగానే స్టేట్‌మెంట్‌ ఇచ్చింది. ఇటీవల విడుదలైన విశ్వరూపం–2 చిత్రంలో యాక్షన్‌ సన్నివేశాల్లోనూ నటించి శభాష్‌ అనిపించుకుంది.

ప్రస్తుతం ధనుష్‌తో నటిస్తున్న వడ చెన్నై చిత్రంలోనూ చాలా వైవిధ్యభరతమైన పాత్రలో కనిపించనుంది. ఇకపై గ్లామర్‌ పాత్రల్లో నటించరాదన్న నిర్ణయం తీసుకుందట అండ్రియా. ఇమేజ్‌ విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపించనున్నట్లు చెప్పింది. కాబట్టి దానికి భంగం కలిగించే లిప్‌లాక్, హీరోలతో సన్నిహితంగా నటించడం, హద్దులు మీరిన గ్లామర్‌ పాత్రల్లో నటించడం వంటి విషయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలిపింది అండ్రియా.

https://www.youtube.com/watch?v=HEOCbJK50i8

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -